Jio with Netflix: లేటెస్ట్ జియో ప్రి పెయిడ్ ప్లాన్స్; ఫస్ట్ టైమ్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ..-jio brings two prepaid plans with netflix subscription price starts at rs 1099 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio With Netflix: లేటెస్ట్ జియో ప్రి పెయిడ్ ప్లాన్స్; ఫస్ట్ టైమ్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ..

Jio with Netflix: లేటెస్ట్ జియో ప్రి పెయిడ్ ప్లాన్స్; ఫస్ట్ టైమ్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ..

HT Telugu Desk HT Telugu
Aug 18, 2023 05:55 PM IST

Jio with Netflix: రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రి పెయిడ్ మొబైల్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా తొలిసారి ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను జియో ఆఫర్ చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Jio with Netflix: రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రి పెయిడ్ మొబైల్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా తొలిసారి ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను జియో ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకు జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తో, జియో ఫైబర్ ప్లాన్స్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ లభించేది. ఇప్పుడు తొలిసారి ఈ ఫెసిలిటీ ప్రి పెయిడ్ ప్లాన్స్ కు కూడా అందిస్తున్నట్లు జియో వెల్లడించింది. ఈ ప్లాన్ 40 కోట్లకు పైగా ఉన్న జియో ప్రి పెయిడ్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

రూ. 1099 ప్లాన్..

తాజాగా, జియో తీసుకువచ్చిన రెండు ప్రి పెయిడ్ ప్లాన్స్ లో ఒకటి ఈ రూ. 1099 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా జియో అన్లిమిటెడ్ 5జీ డేటా, జియో వెల్కమ్ ఆఫర్, రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ తో ఇప్పుడు అదనంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

రూ. 1499 ప్లాన్..

ఈ రూ. 1499 ప్లాన్ తో జియో అన్లిమిటెడ్ 5జీ డేటా, జియో వెల్కమ్ ఆఫర్, రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ తో ఇప్పుడు అదనంగా నెట్ ఫ్లిక్స్ (బేసిక్) లార్జ్ స్క్రీన్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ ను ఇప్పుడు తమ ప్రి పెయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని జియో ప్లాట్ ఫామ్స్ సీఈఓ కిరణ్ థామస్ తెలిపారు.

WhatsApp channel