తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio With Netflix: లేటెస్ట్ జియో ప్రి పెయిడ్ ప్లాన్స్; ఫస్ట్ టైమ్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ..

Jio with Netflix: లేటెస్ట్ జియో ప్రి పెయిడ్ ప్లాన్స్; ఫస్ట్ టైమ్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ..

HT Telugu Desk HT Telugu

18 August 2023, 17:55 IST

  • Jio with Netflix: రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రి పెయిడ్ మొబైల్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా తొలిసారి ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను జియో ఆఫర్ చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jio with Netflix: రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రి పెయిడ్ మొబైల్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా తొలిసారి ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను జియో ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకు జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తో, జియో ఫైబర్ ప్లాన్స్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ లభించేది. ఇప్పుడు తొలిసారి ఈ ఫెసిలిటీ ప్రి పెయిడ్ ప్లాన్స్ కు కూడా అందిస్తున్నట్లు జియో వెల్లడించింది. ఈ ప్లాన్ 40 కోట్లకు పైగా ఉన్న జియో ప్రి పెయిడ్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

రూ. 1099 ప్లాన్..

తాజాగా, జియో తీసుకువచ్చిన రెండు ప్రి పెయిడ్ ప్లాన్స్ లో ఒకటి ఈ రూ. 1099 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా జియో అన్లిమిటెడ్ 5జీ డేటా, జియో వెల్కమ్ ఆఫర్, రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ తో ఇప్పుడు అదనంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

రూ. 1499 ప్లాన్..

ఈ రూ. 1499 ప్లాన్ తో జియో అన్లిమిటెడ్ 5జీ డేటా, జియో వెల్కమ్ ఆఫర్, రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ తో ఇప్పుడు అదనంగా నెట్ ఫ్లిక్స్ (బేసిక్) లార్జ్ స్క్రీన్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ ను ఇప్పుడు తమ ప్రి పెయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని జియో ప్లాట్ ఫామ్స్ సీఈఓ కిరణ్ థామస్ తెలిపారు.

తదుపరి వ్యాసం