Credit card : క్రెడిట్ కార్డు బిల్లులో ‘మినిమమ్ డ్యూ అమౌంట్’ కడితే ఏమవుతుంది?
06 April 2024, 11:24 IST
- Minimum due on credit card : క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ అంటే ఏంటి? మినిమమ్ డ్యూ కడితే ఏమవుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి..
క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ అంటే ఏంటి?
Minimum due in credit card means : ఆర్థిక అవసరాల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డు అనేది ఇప్పుడు సాధారణ జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ చాలా మందికి వాటిని ఎలా వాడుకోవాలో తెలియక.. ఎక్కువ వడ్డీలు చెల్లిస్తూ ఉంటారు. వాటితో పాటు.. క్రెడిట్ కార్డుల చుట్టూ ఎన్నో సందేహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటి.. క్రెడిట్ కార్డు బిల్లులో 'మినిమమ్ అమౌంట్ డ్యూ'ని కడితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి.
క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ..
క్రెడిట్ కార్డు బిల్లులో 'మినిమమ్ అమౌంట్ డ్యూ'ని కడితే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు.. అసలు క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. మన అవసరాలు తీర్చుకునేందుకు బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకుంటాము. అలాంటి వాటిల్లో ఒకటి క్రెడిట్ కార్డు. డబ్బు తీసుకున్న తర్వాత.. బిల్లు జనరేట్ అవుతుంది. ఒక టైమ్ పీరియడ్‌కి ఆ డబ్బులు తిరిగి చెల్లించాలి. లేకపోతే తీసుకున్న అప్పుపై వడ్డీ పడుతుంది.
ఇక.. డ్యూ డేట్ సమయానికి బిల్లులో కట్టాల్సిన మినిమమ్ అమౌంట్‌ని మినిమమ్ డ్యూ అని అంటారు. క్రెడిట్ కార్డు సేవలను పొందాలి అంటే.. కనీస అమౌంట్‌ని కచ్చితంగా కట్టాలి. ఔట్‌స్టాండింగ్ క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ అమౌంట్లో ఈ మినిమిమ్ డ్యూ.. 5శాతం నుంచి 10శాతం మధ్యలో ఉంటుంది.
Minimum due in credit card charges : ఉదాహరణకు.. మీ క్రెడిట్ కార్డు ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ రూ. 20వేలు అనుకుందాము. దాని మీక 5శాతం మినిమమ్ డ్యూ పర్సెంటేజ్ పడితే.. మీరు కట్టాల్సిన మినిమమ్ అమౌంట్ రూ. 1000 అవుతుంది (రూ. 20,000 x 0.05).
ఇదీ చూడండి:- Earn money with credit cards : క్రెడిట్ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు! ఇలా చేయండి..
ఇక క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ అమౌంట్‌ని మాత్రమే కడిత.. మిగిలిన బ్యాలెన్స్ తదుపరి బిల్లింగ్ సైకిల్‌కి ఫార్వర్డ్ అవుతుంది. దీనిపైనా వడ్డీ పడుతుంది. ఈ వడ్డీకి తోడు.. నెక్ట్స్ బిల్లింగ్ సైకిల్లో మీరు తీసుకునే అప్పు పైనా వడ్డీ పడుతుంది. క్రెడిట్ కార్డు బిల్లులను మీరు కంట్రోల్ చేయకపోతే.. మీ మీద ఆర్థిక భారం పెరిగిపోతుంది. సాధారణ రుణాల కన్నా.. క్రెడిట్ కార్డులపై వడ్డీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సమయానికి బిల్లులు కట్టేస్తే.. ఈ అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ట్రాప్‌లో పడకుండా, ఆర్థికంగా ప్రశాంతంగా ఉండొచ్చు.
How credit card works : క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ అమౌంట్‌ని అర్థం చేసుకోవాలంటే.. బిల్లింగ్ సైకల్ని అర్థం చేసుకోవాలి. సాధారణంగా.. ఈ బిల్లింగ్ సైకిల్ 30 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో.. క్రెడిట్ కార్డుపై మీరు చేసే ఖర్చులు రికార్డ్ అవుతాయి. సైకిల్ చివర్లో మీకు స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, న్యూ ఛార్జీలు, మినిమమ్ అమౌంట్ డ్యూ, డ్యూ డేట్‌తో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాలు ఉంటాయి. స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత.. బిల్లులు కట్టేందుకు సాధారణంగా 15 నుంచి 20 రోజుల సమయం ఉంటుంది. ఆలోపు కట్టేస్తే.. మీ మీద వడ్డీ భారం పడదు.
పేమెంట్ రిమైండర్స్, ఆటోమెటిక్ పేమెంట్స్, ఈసీఎస్ సదుపాయం, స్పెండింగ్స్ని మానిటర్ చేయడం ద్వారా మీరు లేట్ పేమెంట్ ఫీజు భారం నుంచి తప్పించుకోవచ్చు.