తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card Risk: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Credit card risk: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

HT Telugu Desk HT Telugu

27 January 2024, 20:10 IST

google News
  • Credit card safety: ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నిత్యావసరమైంది. అత్యవసర సమయాల్లో డబ్బు సమకూర్చి ఆదుకునే క్రెడిట్ కార్డ్ తో చాలా ప్రయోజనాలున్నాయి. కానీ, సరైన క్రమశిక్షణ లేకుండా క్రెడిట్ కార్డ్ ను వినియోగించడం ప్రమాదకరం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. డిజిటల్ పేమెంట్స్ పాపులారిటీ పెరిగిన నేపథ్యంలో.. క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేయడం, ట్యాప్ చేయడం, మొబైల్ చెల్లింపులను ఉపయోగించడం సాధారణం మారింది. అయితే, క్రెడిట్ కార్డ్ ను విచ్చలవిడిగా వాడడం ఎంత ప్రమాదకరమో, ఫోన్ లో అజాగ్రత్తగా క్రెడిట్ కార్డ్ వివరాలను అందించడం కూడా అంతే ప్రమాదకరం. ఈ రెండు పనులతో డబ్బులు భారీగా నష్టపోయే ప్రమాదముంది.

credit card data protection: డేటా ప్రొటెక్షన్

ఒక వ్యాపారి కార్డ్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి, వారు పేమెంట్స్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్‌కు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. ఇది కార్డ్ హోల్డర్ డేటాను, అలాగే, ప్రతి సంవత్సరం ట్రిలియన్ల డాలర్ల లావాదేవీలను రక్షించడానికి రూపొందించిన భద్రతా అవసరాల నిబంధనావళి. క్రెడిట్ కార్డ్ వినియోగదారుడి డేటాను అనుమతి లేకుండా వినియోగించకూడదు. డేటా ఎన్క్రిప్షన్ ఇప్పుడు తప్పనిసరి. దానివల్ల డేటాను దొంగిలించడం సాధ్యం కాదు. కార్డ్ హోల్డర్ డేటాకు యాక్సెస్ అనుమతి పొందిన వ్యక్తులు, లేదా సంస్థలకు మాత్రమే ఉంటుంది.

ఈ వివరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం..

వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా క్రెడిట్ కార్డ్ వివరాలు తెలియజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సీవీవీ, ఓటీపీ, వంటి వివరాలను తెలియజేయకూడదు. అలాగే, స్వైప్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు, మీ కార్డును వారు ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలిస్తూ ఉండాలి. అనధికార లావాదేవీలకు వాడకుండా వారిని నిరోధించాలి. పాస్ వర్డ్ లేదా పిన్ ను వారికి చెప్పకుండా, మీరే ఎంటర్ చేయాలి. పిన్ లేదా పాస్ వర్డ్ ను ఎంటర్ చేసే ముందు, మీరు చెల్లించే మొత్తం కరెక్ట్ గా ఉందో లేదో సరి చూసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటించండి.

మీరు ఫోన్ ద్వారా కార్డ్ వివరాలను అందిస్తున్నట్లయితే, ఈ జాగ్రత్తలు తీసుకోండి.

  1. విశ్వసనీయ వ్యక్తులు లేదా సంస్థల నుంచే మీకు కాల్ వచ్చిందని నిర్ధారించుకోండి.
  2. ఫ్రాడ్ లేదా స్పామ్ కాల్స్ ను చూపే ట్రూ కాలర్ వంటి యాప్స్ హెల్ప్ తీసుకుని, మీకు కాల్ చేసింది సరైన వ్యక్తులేనని నిర్ధారించుకోవచ్చు.
  3. మోసగాళ్లు సాధారణంగా ఏదైనా ప్రముఖ సంస్థ, సాధారణంగా ఏదైనా ఈ కామర్స్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి, మీ పేమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి, మీ కార్డ్ వివరాలు అడుగుతుంటారు.
  4. మీకు అద్భుతమైన డీల్ అని చెప్పి కొన్ని ఆఫర్స్ చెబుతుంటారు. అవి నిజంగా సాధ్యమా? అన్న విషయం ఆలోచించాలి. తప్పుడు కాల్ అని తెలిస్తే, వెంటనే కట్ చేయండి.
  5. సురక్షితమైన పేమెంట్స్ మెథడ్స్ నే వాడండి. వారు ఫోన్ లో పంపే లింక్స్ ను ఓపెన్ చేసి పేమెంట్ చేయవద్దు. ఆ లింక్స్ సాధారణంగా వైరస్ తో ఉంటాయి. ఆ వైరస్ తో మీ ఫోన్ ను హ్యాక్ చేసే అవకాశముంటుంది.
  6. వర్చువల్ క్రెడిట్ కార్డును వాడండి.
  7. ఒకవేళ మీ కార్డు వివరాలు వేరే వారికి వెళ్లాయని భావిస్తే, వెంటనే ఆ కార్డ్ ను బ్లాక్ చేయండి.
  8. పెద్ద మొత్తంలో, మోసపూరితంగా డబ్బుల లావాదేవీ జరిగితే, మీ బ్యాంక్ శాఖను అప్రమత్తం చేయండి. అలాగే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

తదుపరి వ్యాసం