తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Volkswagen Tiguan Exclusive Edition : టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Volkswagen Tiguan Exclusive Edition : టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

06 December 2022, 8:26 IST

    • Volkswagen Tiguan Exclusive Edition : టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ను లాంచ్​ చేసింది వోక్స్​వ్యాగన్​. ఈ మోడల్​ ధర, ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!
టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే! (HT AUTO)

టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Volkswagen Tiguan Exclusive Edition : వోక్స్​వ్యాగన్​ టిగువాన్​.. ఇండియాలో లాంచ్​ అయ్యి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా టిగువాన్​ మోడల్​కు 'ఎక్స్​క్లూజివ్​' ఎడిషన్​ను తాజాగా లాంచ్​ చేసింది వోక్స్​వ్యాగన్​. టిగువాన్​ ధరతో సమానంగానే ఈ ఎక్స్​క్లూజివ్​ ధర కూడా ఉంది. అంటే.. దీని ఎక్స్​షోరూం ధర రూ. 33.50లక్షలు.

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

టిగువాన్​తో పోల్చుకుంటే.. టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో సెబ్రింగ్​ 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. వీల్స్​ మధ్యలో ఉన్న 'వీడబ్ల్యూ' లోగో డైనమిక్​గా కనిపిస్తుంది. రేర్​ లోడ్​ సిల్​ ప్రొటెక్షన్​తో పాటు బీ- పిల్లర్​ మీద ఎక్స్​క్లూజివ్​ అనే బ్యాడ్జ్​ కూడా వస్తుంది. సాధారణంగా.. టిగువాన్​లో ఏడు రంగులు ఉంటాయి. కానీ టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​కు కేవలం రెండు ఆప్షన్స్​(పర్ల్​ వైట్​, ఓరిక్స్​ వైట్​)నే ఇచ్చింది వోక్స్​వ్యాగన్​.

క్యాబిన్​లోని డాష్​బోర్డు, అలుమీనియం పెడల్స్​, ట్రిమ్​ స్పెసిఫిక్​ కుషన్​ పిల్లోస్​ మీద ఎక్స్​క్లూజివ్​ బ్యాడ్జింగ్​ ఉంటుంది. ఈ ఎస్​యూవీలో ఇంటీరియర్​ బ్లాక్​ రంగులో ఉంది. సీట్స్​ మాత్రం వియన్నా లెథర్​తో పాష్​గా కనిపిస్తున్నాయి.

Volkswagen Tiguan Exclusive Edition price : టిగువాన్​తో పోల్చుకుంటే.. టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ ఫీచర్స్​లో మార్పులేమీ లేవు. కాగా.. అన్ని వోక్స్​వ్యాగన్​ వాహనాల్లాగానే ఇందులోనూ పానారోమిక్​ సన్​రూఫ్​, 30 కలర్​ ఆంబియంట్​ లైటింగ్​, త్రీ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, హీటెడ్​ ఫ్రంట్​ సీట్స్​, 10 ఇంచ్​ వర్చువల్​ కాక్​పిట్​, 8 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 8 స్పీకర్స్​ ఉంటాయి.

ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ వోక్స్​వ్యాగన్​ టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​, హిల్​ స్టార్ట్​- డిసెంట్​ అసిస్ట్​, రెయిన్​ సెన్సింగ్​ వైపర్స్​, ఎలక్ట్రానిక్​ డిఫరెన్షియల్​ లాక్​ సిస్టెమ్​ వంటివి ఉంటాయి.

వోక్స్​వ్యాగన్​ టైగన్​ యానివర్సరీ ఎడిషన్​..

టైగన్​ యానివర్సరీ ఎడిషన్​ను ఈ ఏడాది సెప్టెంబర్​లో లాంచ్​ చేసింది వోక్స్​వ్యాగన్​. దీని ధర రూ. 15.69 లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ కారు కర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్ పెయింట్ స్కీమ్‌లతో పాటు అదనంగా ‘రైజింగ్ బ్లూ’ అనే సరికొత్త కలర్ ఆప్షన్‌లోనూ లభ్యమవుతోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రత్యేక ఎడిషన్ కారు డైనమిక్ లైన్, టాప్‌లైన్ అనే వేరియంట్‌లలో అందిస్తున్నారు. డిజైన్ పరంగా, టైగన్ వార్షికోత్సవ ఎడిషన్ మరింత స్పోర్టియర్ లుక్‌తో వచ్చింది. కారు లోపల, వెలుపల '1వ' వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌ను ప్రదర్శిస్తుంది. అదనంగా, టైగన్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో హై లక్స్ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, అల్యూమినియం పెడల్స్‌తో పాటు విండో వైజర్‌లను వంటి ప్రత్యేక అంశాలను కలిగి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం