Volkswagen Taigun Anniversary Edition । మరిన్ని ప్రత్యేకతలతో వచ్చిన టైగన్..!-volkswagen taigun anniversary edition launched check price mileage details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Volkswagen Taigun Anniversary Edition । మరిన్ని ప్రత్యేకతలతో వచ్చిన టైగన్..!

Volkswagen Taigun Anniversary Edition । మరిన్ని ప్రత్యేకతలతో వచ్చిన టైగన్..!

HT Telugu Desk HT Telugu
Sep 08, 2022 07:46 PM IST

భారత మార్కెట్లో Volkswagen Taigun Anniversary Edition విడుదలైంది. ఈ మిడ్-సైజ్ SUV ధరలు రూ, 15 లక్షల నుంచి రూ. 17 లక్షల వర్కు ఉన్నాయి.

<p>Volkswagen Taigun Anniversary Edition</p>
Volkswagen Taigun Anniversary Edition

జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్‌వ్యాగన్ గత ఏడాది సెప్టెంబర్‌లో తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగన్ (Volkswagen Taigun) ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇప్పుడు ఈ కారును లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా టైగన్ యానివర్సరీ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 15.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

స్పెషల్ ఎడిషన్ కారు కర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్ పెయింట్ స్కీమ్‌లతో పాటు అదనంగా ‘రైజింగ్ బ్లూ’ అనే సరికొత్త కలర్ ఆప్షన్‌లోనూ లభ్యమవుతోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్‌ దేశవ్యాప్తంగా 152 డీలర్‌షిప్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. కొనుగోలుదారులకు రూ. 29,999 విలువైన వార్షికోత్సవ కిట్‌ను కూడా కంపెనీ అందజేయనుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రత్యేక ఎడిషన్ కారు డైనమిక్ లైన్, టాప్‌లైన్ అనే వేరియంట్‌లలో అందిస్తున్నారు. డిజైన్ పరంగా, టైగన్ వార్షికోత్సవ ఎడిషన్ మరింత స్పోర్టియర్ లుక్‌తో వచ్చింది. కారు లోపల, వెలుపల '1వ' వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌ను ప్రదర్శిస్తుంది. అదనంగా, టైగన్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో హై లక్స్ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, అల్యూమినియం పెడల్స్‌తో పాటు విండో వైజర్‌లను వంటి ప్రత్యేక అంశాలను కలిగి ఉంది.

Volkswagen Taigun Anniversary Edition ఇంజన్ స్పెసిఫికేషన్స్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్‌లో రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో భాగంగా ఇందులో భాగంగా 6- స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన వేరియంట్లో 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 115 PS పవర్, 178 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

అలాగే 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.5-లోయిటర్ TSI EVO ఇంజన్‌ ఆప్షన్ లోనూ లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 PS శక్తిని , 250 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ SUV లీటరుకు 17.23 కిలోమీటర్ల నుంచి 19.20 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం