BMW M340i 50 Jahre M Edition । బీఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్ కార్, ధర కేవలం అంతే!
లగ్జరీ కార్ మేకర్ BMW తమ M సిరీస్ 50వ వార్షికోత్సవం పురస్కరించుకొని భారత మార్కెట్లో 'M340i 50 Jahre M Edition' అనే సరికొత్త కారును విడుదల చేసింది. ఈ కార్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..
జర్మనీకి చెందిన లగ్జరీ కార్‌మేకర్ బీఎండబ్ల్యూ తాజాగా BMW M340i 50 Jahre M Edition అనే కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ M సిరీస్ డివిజన్ 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ కారును విడుదల చేశారు. విశేషమేమిటంటే ఈ కారును పూర్తిగా చెన్నైకి చెందిన BMW ప్లాంటులోనే తయారు చేశారు. M340i 50 జహ్రే ఎడిషన్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 68.90 లక్షలుగా ఉంది.
ఈ సరికొత్త కారును దీనిలో ఇచ్చే యాక్సెసరీస్ ఆధారంగా రెండు రకాల ఆప్షన్లతో వస్తుంది. కొనుగోలుదారులు తమ అభిరుచికి తగినట్లుగా కార్బన్ ప్యాక్, మోటార్ స్పోర్ట్ ప్యాక్ అనే దానిలో ఏదో ఒక ఆప్షన్ తో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
కార్బన్ ప్యాక్ వినియోగదారులకు కార్బన్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఎలిమెంట్లను అందిస్తుంది. ఇక మోటార్‌స్పోర్ట్ ప్యాక్ మోడల్ M సిరీస్ లో ఉండేటవంటి స్టీరింగ్ వీల్, అల్కాంటారా గేర్ సెలెక్టర్‌లో ఉంటుంది. వెనకవైపున ఇచ్చిన మ్యాట్ బ్లాజ్ స్పాయిలర్ ఈ కారుకు అదనపు ఆకర్షణను అందిస్తుంది.
ఇంజన్ కెపాసిటీ
ఈ కారు కెపాసిటీ విషయానికి వస్తే బానెట్ కింద 3.0-లీటర్ ట్విన్-టర్బో, 6-సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 377 BHP వద్ద 500 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జతచేశారు. అలాగే xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. BMW M340i 50 Jahre M Edition కారు కేవలం 4.4 సెకన్లలోనే సున్నా నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.
ఈ M340i 50 జహ్రే ఎడిషన్ కారు ద్రవిట్ గ్రే, టాంజానైట్ బ్లూ అనే రెండు ఇండివిజువల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం