తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X Fold 3 Pro Vs Samsung Z Fold 6 : ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Vivo X Fold 3 Pro vs Samsung Z Fold 6 : ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

12 July 2024, 13:19 IST

google News
  • Vivo X Fold 3 Pro vs Samsung Z Fold 6 : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో వర్సెస్​ శాంసంగ్​ జెడ్​ ఫోల్డ్​ 6.. ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ చూడండి..

ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

శాంసంగ్ సంస్థ తన లేటెస్ట్ ఫోల్డెబుల్ డివైజ్​లను ఆవిష్కరించింది. కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఇప్పుడు లేటెస్ట్ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. అయితే ఫోల్డెబుల్ సెగ్మెంట్లో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో శాంసంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్​కి గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు:

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ప్రత్యేకంగా రూపొందించిన స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్​ఫామ్​తో పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్​తో కూడిన ఈ చిప్​సెట్ మెరుగైన పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తుంది.

6.3 ఇంచ్​ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 968×2,376 పిక్సెల్స్ రిజల్యూషన్, 410 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఇందులో ఉన్నాయి. 7.6 ఇంచ్​ క్యూఎక్స్ జీఏ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 1,856×2,160 పిక్సెల్స్, 374పీపీఐ పిక్సెల్స్ రిజల్యూషన్​ను ఇందులో అందించారు. రెండు స్క్రీన్లు 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేటుకు మద్దతు ఇస్తాయి. ఇది మృదువైన, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది.

డ్యూయెల్ పిక్సెల్ ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్​తో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. కవర్ డిస్ప్లేలో 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, లోపలి స్క్రీన్​లో 4 మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరా ఉన్నాయి.

సాఫ్ట్​వేర్​​ విషయానికొస్తే, ఈ ఫోల్డెబుల్స్ ఆండ్రాయిడ్ 14పై పనిచేస్తాయి, శాంసంగ్ వన్ యుఐ 6.1.1 ఇందులో ఉంటుంది. ఏడేళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్, రెండు డివైజ్​లకు సెక్యూరిటీ అప్ డేట్స్, లాంగ్ టర్మ్ సాఫ్ట్​వేర్ సపోర్ట్, సెక్యూరిటీని అందించేందుకు శాంసంగ్ కట్టుబడి ఉంది.

ముందువైపు 10 మెగాపిక్సెల్, డిస్ప్లే కెమెరా కింద 4 మెగాపిక్సెల్ కెమెరాలను అందించింది సంస్థ. వెనకవైపు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్తో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు:

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​లో ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ ఓఎస్ 14తో పనిచేస్తుంది. ఇందులో 8.03 ఇంచ్​ ప్రైమరీ ఈ7 అమోఎల్ఈడీ డిస్ప్లే, 2కే రిజల్యూషన్ (2,200×2,480 పిక్సెల్స్), 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10 సపోర్ట్ ఉన్నాయి. సెకండరీ స్క్రీన్ 6.53 ఇంచ్​ అమోఎల్ఈడీ 1,172×2,748 పిక్సెల్స్ రిజల్యూషన్​తో, రెండు స్క్రీన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​ని అందిస్తాయి. మెయిన్, కవర్ డిస్ప్లేలు స్క్రీన్-టు-బాడీ రేషియో వరుసగా 91.77% మరియు 90.92% కలిగి ఉన్నాయి.

స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ తో నడిచే వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో 16 జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. ఇది బలమైన కార్బన్ ఫైబర్ హింజ్​ని కలిగి ఉంది. ముందు భాగం గాజు నుంచి, వెనుక భాగం గాజు ఫైబర్ నుంచి మరియు మధ్య ఫ్రేమ్ అల్యూమినియం మిశ్రమం నుంచి నిర్మించడం జరిగింది.

ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 64 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రైమరీ, కవర్ స్క్రీన్లలో వివో వీ3 ఇమేజింగ్ చిప్ సపోర్ట్​తో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉన్నాయి.

కనెక్టివిటీ ఫీచర్లలో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సి, మల్టిపుల్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్ తదితర సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్ 8 రేటింగ్ కూడా ఇందులో ఉన్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 100వాట్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలతో 5,700 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ పరికరం 159.96x142.4x5.2 మిమీ కొలత, 236 గ్రాముల బరువు ఉంటుంది. మారుతుంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో వర్సెస్ శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6 ధర:

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,64,999గా ఉంది. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,76,999గాను, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,00,999.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 16 జీబీ ర్యామ్ / 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,59,999గా ఉంది.

తదుపరి వ్యాసం