Vivo X Fold 3 Pro vs OnePlus Open: ఈ రూ.1 లక్ష విలువ చేసే ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?-vivo x fold 3 pro vs oneplus open which foldable smartphone is a better buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X Fold 3 Pro Vs Oneplus Open: ఈ రూ.1 లక్ష విలువ చేసే ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Vivo X Fold 3 Pro vs OnePlus Open: ఈ రూ.1 లక్ష విలువ చేసే ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Jun 10, 2024 03:20 PM IST

Vivo X Fold 3 Pro : వీవో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో వర్సెస్​ వన్​ప్లస్​ ఓపెన్​. ఈ రెండిట్లో ఏ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ కొంటే బెటర్​? ఇక్కడ తెలుసుకోండి..

వీవో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో వర్సెస్​ వన్​ప్లస్​ ఓపెన్​
వీవో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో వర్సెస్​ వన్​ప్లస్​ ఓపెన్​ (Vivo/ OnePlus)

Vivo X Fold 3 Pro price in India : వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో గత వారం భారత ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో అరంగేట్రం చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ థిన్​ డిజైన్​ని కలిగి ఉండటమే కాకుండా, స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 చిప్​సెట్​ సపోర్ట్ చేసే భారతదేశపు తొలి ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ గ్యాడ్జెట్​ని.. వన్​ప్లస్​ ఓపెన్​తో పోల్చి, ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఏది కొనొచ్చు? అనేది ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో వర్సెస్ వన్​ప్లస్ ఓపెన్..

డిజైన్: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోని ఫోల్డ్​ చేసినప్పుడు 11.2 ఎంఎం, తెరిచినప్పుడు 5.2 ఎంఎం మాత్రమే ఉంటుంది. కేవలం 236 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్​ఫోన్​ను ఆర్మర్ ఆర్కిటెక్చర్​తో రూపొందించారు. మరోవైపు, వన్​ప్లస్​ ఓపెన్ బరువు 239 గ్రాములు. టైటానియం అల్లాయ్, కార్బన్ ఫైబర్ హింజ్​తో రూపొందించిన ఈ స్మార్ట్​ఫోన్ తేలికైన ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​గా ఉంటుంది.


Vivo X Fold 3 Pro features : డిస్​ప్లే: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో 6.53 ఇంచ్​ కవర్ డిస్​ప్లే, 8.03 ఇంచ్​ మెయిన్ ఫోల్డెబుల్ డిస్​ప్లే, అమోఎల్ఈడీ, ఎల్టీపీఓ 8 టెక్నాలజీ ఉన్నాయి. ఈ రెండు డిస్​ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 హెర్ట్జ్ లోకల్ పీక్ బ్రైట్​నెస్​ని సపోర్ట్ చేస్తాయి.

వన్​ప్లస్​ ఓపెన్​లో 6.31 ఇంచ్​ కవర్ డిస్​ప్లే, 7.82 ఇంచ్​ మెయిన్ డిస్​ప్లే ఉన్నాయి. రెండు డిస్​ప్లేలు ఎల్టీపీఓ 3.0 డిస్​ప్లే టెక్నాలజీతో సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్​ని సపోర్ట్ చేస్తాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ని సపోర్ట్ చేస్తాయి.

కెమెరా: హై క్వాలిటీ ఫోటోగ్రఫీ కోసం, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్తో 50 మెగాపిక్సెల్ వీసీఎస్ ప్రధాన కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఏఎఫ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వంటివి ఉంటాయి.

OnePlus Open price in India : వన్​ప్లస్​ ఓపెన్ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంటుంది. 40 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి-టీ808 ప్రధాన కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 64 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ 64 బీ కెమెరా, 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 581 అల్ట్రా-వైడ్ కెమెరాతో వస్తుంది.

పర్ఫార్మెన్స్​: మల్టీటాస్కింగ్ సామర్థ్యాల కోసం, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్నాప్​డ్రాగన్ 3 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. వన్​ప్లస్​ ఓపెన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్ 2 ఎస్ఓసీ ఉంది. ఈ రెండు డివైజ్​లు 16 జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ను సపోర్ట్ చేస్తాయి.


OnePlus Open features : బ్యాటరీ: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 100 వాట్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేసే 5700 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, వన్​ప్లస్​ ఓపెన్​లో 4805 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల సూపర్ వూక్ ఛార్జింగ్ ఉన్నాయి.

ధర : వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ధర రూ.159999, వన్​ప్లస్​ ఓపెన్ ప్రారంభ ధర రూ.139999.

WhatsApp channel

సంబంధిత కథనం