తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Us Visa Fees: ఏప్రిల్ 1 నుంచి యూఎస్ వీసా ఫీజులు పెరుగుతున్నాయి.. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసా ఫీజు ఎంతంటే..?

US visa fees: ఏప్రిల్ 1 నుంచి యూఎస్ వీసా ఫీజులు పెరుగుతున్నాయి.. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసా ఫీజు ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu

30 March 2024, 16:58 IST

  • అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నవారు వీసా దరఖాస్తు ఫీజుల కోసం ఇకపై ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూఎస్ వీసా ఫీజులు పెరుగుతున్నాయి. 2016 తర్వాత హెచ్-1బీ (H-1B visa), ఎల్-1 (L-1 visa), ఈబీ-5 (EB-5 visa) వీసా కేటగిరీల్లో వీసా ఫీజును పెంచడం ఇదే తొలిసారి.

హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ 5 వీసా ఫీజుల పెంపు
హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ 5 వీసా ఫీజుల పెంపు

హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ 5 వీసా ఫీజుల పెంపు

సోమవారం (ఏప్రిల్ 1) నుంచి హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ అమెరికా వీసా (US visa)లపై భారీగా ఫీజులు పెరగనున్నాయి. వీసా సేవల్లో సమూల మార్పులు, ఇమ్మిగ్రేషన్ విధానాలు, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే ఈ మార్పులు అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలకం కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

ముఖ్యమైన విషయాలు..

  • హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాల ద్వారా భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు ఎక్కువగా వీసాలు పొందుతుంటారు.
  • 2016 తర్వాత హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసా కేటగిరీల ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. హెచ్ -1బీ వీసా, ఎల్ -1 వీసా, ఈబీ-5 వీసాలకు పెంచిన కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

H-1B visa: హెచ్1బీ వీసా

  • హెచ్1బీ (H-1B visa) వీసా దరఖాస్తు (ఫారం ఐ-129) ఫీజును 460 డాలర్ల (రూ.38,000కు పైగా) నుంచి 780 డాలర్లకు (రూ. 64,000కు పైగా) పెంచారు. ఈ పెంపు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ రిజిస్ట్రేషన్ కూడా 10 డాలర్లు (రూ.829) నుంచి 215 డాలర్లకు (రూ.17,000కు పైగా) పెరగనుంది.
  • హెచ్ -1బి (H-1B visa) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించడానికి యుఎస్ కంపెనీలను అనుమతిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి ఏటా పదుల సంఖ్యలో ఈ వీసాతో ఉద్యోగులను నియమించుకుంటాయి.

L-1 visa: ఎల్ -1 వీసా

  • ఎల్ 1 వీసా (L 1 visa) ల ఫీజును 460 డాలర్ల (రూ.38,000కు పైగా) నుంచి 1,385 డాలర్లకు (రూ.1,10,000 కంటే ఎక్కువ) పెంచారు.ఈ పెంపు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
  • ఎల్ -1 వీసా కూడా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలోకి వస్తుంది. బహుళజాతి కంపెనీలు తమ విదేశీ కార్యాలయాల నుంచి కొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా అమెరికాలో పనిచేయడానికి బదిలీ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

EB-5 visa: ఈబీ-5 వీసా

  • ఈబీ-5 వీసా (EB-5 visa). దీన్నే ఇన్వెస్టర్స్ వీసా (investors visa) అని కూడా అంటారు. ఈ వీసా దరఖాస్తు ఫీజును 3,675 డాలర్ల (రూ.3,00,000కు పైగా) నుంచి 11,160 డాలర్లకు (రూ.9,00,000కు పైగా) పెంచారు. ఈ పెంపు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
  • అమెరికా ప్రభుత్వం ఈ ఈబీ-5 ప్రోగ్రామ్ ను 1990లో ప్రారంభించింది. విదేశాల్లోని సంపన్నులైన పారిశ్రామికవేత్తలు అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్లతో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే, వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ వీసా ఇస్తారు. ఆ వ్యాపారం ద్వారా అమెరికాలో కనీసం 10 మంది అమెరికన్లకు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం