తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Union Budget 2024-25: జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు; జూలై 23 న కేంద్ర బడ్జెట్

Union Budget 2024-25: జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు; జూలై 23 న కేంద్ర బడ్జెట్

HT Telugu Desk HT Telugu

06 July 2024, 16:11 IST

google News
  • పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు.  జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్ ను ఈ నెల 23న ప్రవేశపెడ్తారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Shrikant Singh)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నారు. 2024-25 సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ (BUDGET) ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ నెల 23న ప్రవేశపెడ్తారు.

రాష్ట్రపతి ఆమోదం

‘‘భారత ప్రభుత్వ సిఫారసు మేరకు 2024 జూలై 22 నుంచి 2024 ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనకు గౌరవ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2024-25 కేంద్ర బడ్జెట్ ను 2024 జూలై 23న లోక్ సభలో ప్రవేశపెడతాము’’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం ట్వీట్ చేశారు.

తాత్కాలిక బడ్జెట్

లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తాత్కాలికంగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంప్రదాయం ప్రకారం లోక్ సభ ఎన్నికలు జరిగే సంవత్సరం ముందుగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు. అందులో కీలకమైన పాలసీ ప్రతిపాదనలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత, గెలిచిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది. అందులో కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు ఉంటాయి.

తదుపరి వ్యాసం