Lok Sabha session: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు!; జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ!-first session of 18th lok sabha expected to begin on june 24 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Session: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు!; జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ!

Lok Sabha session: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు!; జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ!

HT Telugu Desk HT Telugu
Jun 11, 2024 03:04 PM IST

Lok Sabha session: పార్లమెంటు సమావేశాలు జూన్ 24, 2024 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, జూన్ 24న నూతన లోక సభ కొలువుతీరుతుంది. ఆ రోజు నుంచి రెండు రోజుల పాటు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు.

జూన్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు
జూన్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు

Lok Sabha session: Lok Sabha session: పార్లమెంటు సమావేశాలు జూన్ 24, 2024 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, జూన్ 24న నూతన లోక సభ కొలువుతీరుతుంది. ఆ రోజు నుంచి రెండు రోజుల పాటు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు. 18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభం కానున్నాయని, పార్లమెంటు దిగువ సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు మొదటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.

ప్రొటెం స్పీకర్ గా రాధామోహన్ సింగ్

ఏడోసారి లోక్ సభకు ఎన్నికైన అత్యంత సీనియర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్ సింగ్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. జూన్ 27న రాష్ట్రపతి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత, జూలై 3 వ తేదీన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జులై 22 వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ వేసవిలో లోక్ ఎన్నికలకు ముందు 2024, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

టీ20 వరల్డ్ కప్ 2024