తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Ev Two Wheelers : 2 ఎలక్ట్రిక్ టూ వీలర్ల లాంచ్‌కు టీవీఎస్ ప్లాన్.. హోండా యాక్టివా ఈవీ కంటే ముందే జూపిటర్!

TVS EV Two Wheelers : 2 ఎలక్ట్రిక్ టూ వీలర్ల లాంచ్‌కు టీవీఎస్ ప్లాన్.. హోండా యాక్టివా ఈవీ కంటే ముందే జూపిటర్!

Anand Sai HT Telugu

28 October 2024, 22:45 IST

google News
    • TVS EV Two Wheelers : భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు ఈ సెగ్మెంట్‌పై కన్నేశాయి. ఇప్పటికే అనేక కంపెనీలను ఈవీ స్కూటర్లను తీసుకొచ్చాయి. ఇప్పుడు టీవీఎస్ మరో రెండు ఈవీలను తీసుకురానుంది.
టీవీఎస్ జూపిటర్
టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన కంపెనీలలో టీవీఎస్ ఉంది. ప్రముఖ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న కంపెనీ త్వరలో 2 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. టీవీఎస్ మార్చి 2025 నాటికి భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయనుంది. పెట్టుబడిదారుల సమావేశంలో బ్రాండ్ సీఈవో కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇవి త్వరలో లాంచ్ అయితే కంపెనీ లైనప్‌లో మరో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు చేరనున్నాయి. అయితే మరోవైపు హోండా యాక్టివా ఈవీ వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే దీనికంటే ముందే టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోందని సమాచారం.

ఇంతకుముందు టీవీఎస్ భారతీయ మార్కెట్లో ఐక్యూబ్ ఈవీని మాత్రమే విక్రయించింది. దీనిని మొత్తం 5 వేరియంట్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 1,07,299. టాప్ వేరియంట్ కోసం రూ. 1,36,62దాకా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. అమ్మకాల గణాంకాలు చూస్తే.. కంపెనీ మంచి కస్టమర్ బేస్‌ను పొందుతుంది. FY25 ప్రథమార్ధంలో మొత్తం 1.27 లక్షల యూనిట్ల రిటైల్ విక్రయాలతో టాప్-5 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జాబితాలో కంపెనీ ఉంది. ఇక రాబోయే రెండు ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌తో మార్కెట్‌ మీద మంచి పట్టు సాధించాలని చూస్తోంది.

టీవీఎస్ జూపిటర్ ఈవీ

కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి కంపెనీ ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. టీవీఎస్ జూపిటర్ ఈవీని ప్రవేశపెట్టనున్నట్లు కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ఈవీ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చని కొందరు చెబుతున్నారు. ఇది కాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా పరిచయం చేయవచ్చు.

టీవీఎస్ ఎక్స్ఎల్ ఈవీ

టీవీఎస్ భారత మార్కెట్ కోసం ఎక్స్ఎల్ ఈవీ, ఈ ఎక్స్ఎల్ అనే రెండు మోడల్స్ తీసుకురానుందని చర్చ నడుస్తోంది. రాబోయే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించాలని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా అందాల్సి ఉంది.

తదుపరి వ్యాసం