తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Electric Scooter : టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. రేపే లాంచ్​!

TVS electric scooter : టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. రేపే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

22 August 2023, 12:50 IST

    • TVS electric scooter : టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ బుధవారం లాంచ్​ అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. రేపే లాంచ్​
టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. రేపే లాంచ్​

టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. రేపే లాంచ్​

TVS electric scooter : టీవీఎస్​ నుంచి బుధవారం ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​కానుంది! ఇది క్రియాన్​ స్కూటర్​ ఆధారిత ఈవీ అని తెలుస్తోంది. ఈ మోడల్​కు సంబంధించిన టీజర్​ను సంస్థ తాజాగా విడుదల చేసింది. లాంచ్​ నేపథ్యంలో ఈ టీవీఎస్​ కొత్త ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

టీవీఎస్​ ఈ-స్కూటర్​ ఎలా ఉండనుంది?

బెంగళూరులో ఇటీవలే ఈ ఎలక్ట్రిక్​ వాహనం దర్శనమిచ్చింది. అయితే దీని పేరు క్రియాన్​ ఈవీగా ఉండకపోవచ్చని సమాచారం. "క్సానిక్​" లేదా "ఎన్​టార్​క్యూ".. ఈ రెండింట్లో ఒక పేరు ఉండొచ్చని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కాకపోతే ఇది క్రియాన్​కు ఎలక్ట్రిక్​ అవతారం అని సమాచారం. 2018లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్​ మోడల్​ను ప్రదర్శించింది టీవీఎస్​ సంస్థ.

ఇక అఫీషియల్​ టీజర్స్​ ప్రకారం.. ఈ టీవీఎస్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్క్వేర్​ షేప్​ ఎల్​ఈడీలు (వర్టికల్​) ఉంటాయి. ఏప్రాన్​ ప్యానెల్​ అట్రాక్టివ్​గా ఉండనుంది. ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​ వస్తాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- New electric scooters : మార్కెట్​లోకి నాలుగు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు.. హైలైట్స్​ ఇవే!

ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉండనుంది. టీఎఫ్​టీ స్క్రీన్​ ఎడమవైపు బ్యాటరీ పర్సెంటేజ్​, టైమ్​ వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మోడల్​ టాప్​ స్పీడ్​ 105 కేఎంపీహెచ్​ అని సమాచారం. దీని రేజ్​ 90-105 కి.మీల మధ్యలో ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

TVS Creon electric scooter : ఈ టీవీఎస్​ క్రియాన్​ ఆధారిత ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.60లక్షలుగా ఉండొచ్చు. కస్టమర్లలో ఈ మోడల్​పై ఆసక్తి కనిపిస్తోంది. మరి ఇది అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి విషయాలపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బుధవారం లాంచ్​తో వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.

లాంచ్​ తర్వాత.. ఓలా ఎస్​1 ప్రోకు ఈ మోడల్​ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం