Toyota Fortuner Leader edition : ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్ లాంచ్.. మరింత బోల్డ్‌గా- మరింత స్టైలిష్‌గా!
23 April 2024, 13:09 IST
- Toyota Fortuner Leader edition launched : టయోటా ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టయోటా ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్ ఇదిగో..
Toyota Fortuner Leader edition price : ఇండియాలో టయోటో కిర్లోస్కర్ మోటార్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది టయోటా ఫార్చ్యునర్. బోల్డ్‌నెస్‌కి, స్టైలింగ్‌కి పెట్టింది పేరుగా మారింది ఈ కారు. ఇక ఇప్పుడు.. ఫార్చ్యునర్కు స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీని పేరు టయోటా ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్. ఇందులో కొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో పాటు అదనపు ఫీచర్స్ ఉన్నాయి. ఈ మోడల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్ విశేషాలను ఇక్కడ చూద్దాము..
టయోటా ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్ లాంచ్..
టయోటా ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్‌లో కొత్త ఫ్రెంట్- రేర్ బంపర్ స్పాయిలర్స్, బ్లాక్- వైట్ రంగుల్లో డ్యూయెల్ టోన్ ఎక్స్టీరియర్ పెయింట్ ఆప్షన్, బ్లాక్ అలాయ్ వీల్స్ వంటివి వస్తున్నాయి. స్పాయిలర్స్‌ని ఆథరైజ్డ్ డీలర్స్ ఫిట్ చేస్తారు. ఇక ఇంటీరియర్‌లో డ్యూయెల్ టోన్ సీట్లు, వయర్లెస్ ఛార్జర్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్), ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ వంటి యాడెడ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఫార్చ్యునర్కు మరింత బోల్డ్‌నెస్‌ని, మరిన్ని ఫీచర్స్‌ని యాడ్ చేసేందుకే.. ఈ లీడర్ ఎడిషన్‌ని తీసుకొచ్చినట్టు టయోటో కర్లిస్కోర్ మోటార్ సేల్స్ సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు.
ఇదీ చూడండి:- Kia EV3 : కియా నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్.. ఈవీ3పై భారీ అంచనాలు!
Toyota Fortuner Leader edition : ఇక కొత్త ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్ ధర.. సాధారణ మోడల్స్ కన్నా రూ. 80వేలు అధికంగా ఉంటుందని తెలుస్తోంది. ధరపై ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ వివరాలను సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొత్త టయోటా ఫార్చ్యునర్ బుకింగ్స్ మొదలయ్యాయి. డీలర్షిప్ షోరూమ్స్‌కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.
ఈ ఫార్చ్యునర్ లీడర్ ఎడిషన్.. ఒక 4x2 వేరియంట్. ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 6 స్పీడ్ మేన్యువల్ లేదా ఆటోమెటిక్ ట్రాన్స్మీషన్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆటోమెటిక్ వేరియంట్.. 201 బీహెచ్పీ పవర్‌ని, 500 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇక మేన్యువల్ వేరియంట్.. 201 బీహెచ్పీ పవర్‌ని, 420 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
Toyota Fortuner Leader edition features : 2009లో తొలిసారిగా లాంచ్ అయినప్పటి నుంచి.. ఈ టయోటా ఫార్చ్యునర్.. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌ని ఏలుతోంది. ఎఫ్వై23-24లో సైతం.. 48శాతం వృద్ధిని నమోదు చేసింది టయోటా. 2.65 లక్షలు యూనిట్ హోల్‌సేల్స్ ఉన్నాయి. దాని ముందు ఆర్థిక ఏడాదిలో అది 1.77లక్షలు మాత్రమే. ఫార్చ్యునర్, ఇన్నోవా క్రిస్టా వల్లే ఇంతటి వృద్ధి సాధ్యమైందని సంస్థ చెబుతోంది.