Toyota Urban Cruiser Taisor: కాంపిటీటివ్ ఎస్ యూ వీ సెగ్మెంట్లోకి మరో ఎస్ యూ వీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లాంచ్-in pics toyota urban cruiser taisor debuts is based on maruti fronx ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Toyota Urban Cruiser Taisor: కాంపిటీటివ్ ఎస్ యూ వీ సెగ్మెంట్లోకి మరో ఎస్ యూ వీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లాంచ్

Toyota Urban Cruiser Taisor: కాంపిటీటివ్ ఎస్ యూ వీ సెగ్మెంట్లోకి మరో ఎస్ యూ వీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లాంచ్

Apr 03, 2024, 09:10 PM IST HT Telugu Desk
Apr 03, 2024, 09:10 PM , IST

  • Toyota Urban Cruiser Taisor: భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో అత్యంత ఎక్కువ పోటీ నెలకొన్న సెగ్మెంట్ ఎస్ యూ వీ సెగ్మెంట్. ఎస్ యూ వీలకు భారతీయ వినియోగదారుల్లో పాపులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా, అర్బన్ క్రూయిజర్ టైజర్ ను టయోటా సంస్థ మార్కెట్లోకి తీసుకువస్తోంది.

టయోటా తన అత్యంత సరసమైన ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అర్బన్ క్రూయిజర్ టైజర్ గా పిలిచే ఈ కారును మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్లాట్ ఫామ్ పై రూపొందించారు. కాబట్టి, ఈ రెండు ఎస్ యూవీల్లో చాలా పోలికలు ఉంటాయి.

(1 / 10)

టయోటా టైజర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది.  అవి ఇ, ఎస్, ఎస్+, జి, వి వేరియంట్లు. వీటి ఎక్స్ షో రూమ్ ధర రూ. 7.73 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.03 లక్షల వరకు ఉంది.

(2 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఇంటీరియర్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ తో పోలి ఉంటుంది. త్రీ-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో అనలాగ్ డయల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

(3 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ముందు భాగంలో కొత్త గ్రిల్,  టయోటా బ్యాడ్జింగ్ ఉన్న ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ గ్రిల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర టయోటా మోడళ్ల తరహాలోనే ఉంది.

(4 / 10)

 టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లో మూడు పవర్ట్రెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్, సీఎన్జీ పవర్ ట్రైన్ ఉన్నాయి. ఈ మూడు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి. 

(5 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5-స్పీడ్ ఏజీఎస్ తో వస్తుంది, టర్బో పెట్రోల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పొందుతుంది. సిఎన్ జి వెర్షన్ కు మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే లభిస్తుంది. 

(6 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లోని నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 88 బీహెచ్ పీ పవర్,  113ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది, సీఎన్ జీతో నడిచేటప్పుడు 76 బీహెచ్ పీ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్ పి పవర్, 148 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 

(7 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్స్ మారుతి సుజుకి వాహనాల్లో ఉన్న వాటి తరహాలో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేస్తుంది.

(8 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లో హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్ బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. 

(9 / 10)

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లో అదనంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడీ లైటింగ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు