New Toyota Fortuner : టయోటా ఫార్చ్యునర్‌లో 2 కొత్త వేరియంట్లు లాంచ్..
New Toyota Fortuner : భారీ డిమాండ్ ఉన్న ఫార్చ్యునర్కు రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది టయోటా సంస్థ. వీటి పేర్లు టయోటా మోడలిస్టా, టయోటా జీఆర్ స్పోర్ట్. పూర్తి వివరాలు..
New Toyota Fortuner : టయోటా ఫార్చ్యునర్కు ఇండియాలో సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ భారీ ఎస్‌యూవీకి డిమాండ్ ఎక్కువే. ఇక ఇప్పుడు.. ఫార్చ్యునర్‌లో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా. 2023 బ్యాంకాక్ మోటార్ షోలో ఈ కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. వాటి పేర్లు టయోటా ఫార్చ్యునర్ మోడలిస్టా, 2023 జీఆర్ స్పోర్ట్. ఆటోమొబైల్ మార్కెట్లో వీటికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని సంస్థ భావిస్తోంది.
2023 టయోటా ఫార్చ్యునర్ మోడలిస్టా.. జీఆర్ స్పోర్ట్..
టయోటా ఫార్చ్యునర్ మోడలిస్టాలో 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ మోడల్ జపాన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయంగానూ హై క్వాలిటీ ప్రాడక్ట్‌నే టయోటా తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి. మోడలిస్టా కిట్‌తో ఈ వెహికిల్‌ను మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కూడా టయోటా కల్పిస్తుందని సమాచారం. ఫలితంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మరింత పెరుగుతుంది.
Toyota Fortuner Modellista : మరో కొత్త వేరియంట్ టయోటా జీఆర్ స్పోర్ట్‌లో 2.8 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. చాలా రేసింగ్ కార్స్లో దీనిని ఉపయోగిస్తారు. దీనిని టయోటా గాజూ రేసింగ్ అభివృద్ధి చేసింది. అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే విధంగా ఈ టయోటా జీఆర్ స్పోర్ట్‌ను డిజైన్ చేసింది సంస్థ. ఇందులో లెక్సెస్ తరహా భారీ గ్రిల్ ఉండటంతో లుక్ మరింత బోల్డ్‌గా, స్టైలిష్‌గా, స్పోర్టీగా మారింది.
Toyota Fortuner GR Sport launch : ఈ జీఆర్ స్పోర్ట్‌లో 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. రేర్ ప్యాసింజర్లకు ఓవర్‌హెడ్ స్క్రీన్ ఆప్షన్ కూడా లభిస్తోంది. ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రైలర్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా వస్తున్నాయి.
కొత్త వేరియంట్ల ధరలు..
2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ టయోటా ఫార్చ్యునర్ మోడలిస్టా ఎక్స్‌షోరూం ధర 1.67 మిలియన్ థాయ్ భ్ట్. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు రూ. 40.41లక్షలు. 2023 ఫార్చ్యునర్ జీఆర్ స్పోర్ట్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర 1.8 మిలియన్ థాయ్ భాట్. అంటే రూ. 45.9లక్షలు.
Toyota Fortuner new variants : ఇండియాలో వీటి లాంచ్‌పై ప్రస్తుతం స్పష్టత లేదు. అయితే త్వరలోనే ఇవి ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో లాంచ్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న ఫార్చ్యునర్కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని కూడా టయోటా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం