తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Layoffs In Japan: తోషిబాలో 5,000 ఉద్యోగాల కోత; జపాన్ లో కూడా ప్రారంభమైన లే ఆఫ్స్ ట్రెండ్

Layoffs in Japan: తోషిబాలో 5,000 ఉద్యోగాల కోత; జపాన్ లో కూడా ప్రారంభమైన లే ఆఫ్స్ ట్రెండ్

HT Telugu Desk HT Telugu

18 April 2024, 15:11 IST

google News
  • Toshiba layoffs: జపాన్ లో ఉద్యోగుల తొలగింపు చాలా అసాధారణం. అక్కడ ఎప్పుడూ కూడా నిపుణులైన ఉద్యోగులకు కొరతే ఉంటుంది. కానీ, ఈ మధ్య జపాన్ లో కూడా వివిధ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ప్రారంభించాయి. లేటెస్ట్ గా, తోషిబా 5,000 ఉద్యోగాలను తొలగించాలని భావిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

ప్రతీకాత్మక చిత్రం

Toshiba layoffs: జపాన్ లోని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో తోషిబా కార్పొరేషన్ ఒకటి. ఈ సంస్థ ఇప్పుడు 5,000 మంది ఉద్యోగులను తగ్గించాలని (Lay offs) యోచిస్తున్నట్లు నిక్కీ నివేదిక తెలిపింది. ఇది దేశంలోనే అతిపెద్ద లే ఆఫ్ ప్రక్రియ అని భావిస్తున్నారు. సాధారణంగా, జపాన్ లో కంపెనీలు లే ఆఫ్స్ కు వ్యతిరేకం. అక్కడ ఉద్యోగుల కొరత అధికం. కానీ, మారిన పరిస్థితుల్లో అక్కడి కంపెనీలు కూడా లే ఆఫ్స్ బాట పడుతున్నాయి.

కార్మిక చట్టాలు స్ట్రాంగ్

టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్ కోర్ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా తోషిబాకు సుమారు 100 బిలియన్ డాలర్లు (రూ.5,400 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేసింది. జపాన్ లో కార్మిక చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కార్మికుల పరిరక్షణకు, ఉద్యోగ భద్రతకు అవి పెద్ద పీట వేస్తాయి. అయితే, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం జపాన్ లోని కంపెనీలపై పడింది. దాంతో అక్కడి బ్లూ చిప్ కంపెనీలు కూడా లే ఆఫ్స్ ను ప్రకటిస్తున్నాయి. షిసిడో కంపెనీ, ఒమ్రాన్ కార్ప్, కోనికా మినోల్టా ఇంక్ తో సహా అనేక ఇతర ప్రముఖ జపనీస్ సంస్థలు కూడా ఇటీవలి నెలల్లో ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. తోషిబా తన మెమరీ-చిప్ వ్యాపారాన్ని విక్రయించడంతో సహా నష్టాల నుండి కోలుకోవడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు.

తదుపరి వ్యాసం