Swiggy Lay offs: స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్ ల్లోనూ ఉద్యోగాల కోత!-swiggy flipkart to trim workforce ahead of ipos ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Swiggy Lay Offs: స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్ ల్లోనూ ఉద్యోగాల కోత!

Swiggy Lay offs: స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్ ల్లోనూ ఉద్యోగాల కోత!

HT Telugu Desk HT Telugu
Jan 26, 2024 06:43 PM IST

Swiggy, Flipkart Lay offs: 2024 ప్రారంభం నుంచి వివిధ టెక్ కంపెనీల్లో లే ఆఫ్ ల పర్వం ప్రారంభమైంది. గూగుల్, మెటా లు ఇప్పటికే వివిధ విభాగాల్లో లే ఆఫ్ ప్రకటించాయి. తాజాగా, స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్ లు కూడా లే ఆఫ్స్ ప్రకటించనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Swiggy, Flipkart Lay offs: ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లు వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రెండు కంపెనీల్లోని సుమారు 1,400 మంది ఎగ్జిక్యూటివ్ లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుమారు 1000 మంది..

వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగా వార్షిక పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ గా తీసుకున్న నిర్ణయమేనని, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన త్రైమాసిక టౌన్ హాల్ సమావేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి ఉద్యోగులతో మాట్లాడుతూ.. గ్రోసరి విభాగంలో వృద్ధి నమోదు అయిందని తెలిపారు.

సొంత యూపీఐ

గత ఏడాది ఫోన్ పే తో తెగతెంపులు చేసుకున్న ఫ్లిప్ కార్ట్ తన సొంత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) కి ఆర్బీఐ నుంచి ఆమోదం పొందిందని కృష్ణమూర్తి ఉద్యోగులకు తెలిపారు. యూపీఐ లావాదేవీల కోసం ఇతర థర్డ్ పార్టీ యూపీఐలపై ఆధారపడకుండా ఉండడానికి వినియోగదారులకు ఇది సహాయపడుతుంది.

స్విగ్గీ కూడా..

స్విగ్గీ త్వరలో ఐపీఓకు రానుందన్న వార్తల నేపథ్యంలో.. ఈ లేఆఫ్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఐపీఓను ప్రకటించడానికి ముందే సుమారు 350-400 మంది ఉద్యోగులను తొలగించాలని స్విగ్గీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యయ తగ్గింపు నిర్ణయం కాదని, సంస్థ నిర్వహణ సామర్థ్యాలను పెంచే ప్రయత్నాల్లో భాగమని స్విగ్గీ చెబుతోంది. ప్రస్తుతం స్విగ్గీలో సుమారు 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన స్విగ్గీ ఈ ఏడాది చివర్లో ఐపీఓకు రానుంది.

సీనియర్ల నిష్క్రమణ

ఫ్లిప్ కార్ట్ న్యూ బిజినెస్ మాజీ హెడ్ ఆదర్శ్ మీనన్ ఈ నెల ప్రారంభంలో జూమ్ కార్ లో చేరారు. కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ గత అక్టోబర్ లో వైదొలగగా, ఫ్లిప్ కార్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉత్కర్ష్ బి గత ఏప్రిల్ లో వెళ్లిపోయారు. స్విగ్గీ నుంచి నిష్క్రమించిన వారిలో బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ (వీపీ) ఆశిష్ లింగంనేని, ఇన్ స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే, రెవెన్యూ అండ్ గ్రోత్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్వీపీ) అనుజ్ రాఠీ ఉన్నారు. అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్కో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ విలువను వరుసగా రెండోసారి 8.3 బిలియన్ డాలర్లకు పెంచింది.

Whats_app_banner