తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3 Shine Launch : సిట్రోయెన్​ సీ3 టాప్​ ఎండ్​ వేరియంట్​ లాాంచ్​.. విశేషాలివే!

Citroen C3 Shine launch : సిట్రోయెన్​ సీ3 టాప్​ ఎండ్​ వేరియంట్​ లాాంచ్​.. విశేషాలివే!

Sharath Chitturi HT Telugu

14 April 2023, 6:13 IST

google News
    • Citroen C3 Shine launched : సిట్రోయెన్​ సీ3 షైన్​ వేరియంట్​ లాంచ్​ అయ్యింది. పూర్తి వివరాలు..
సిట్రోయెన్​ సీ3 టాప్​ ఎండ్​ వేరియంట్​ లాాంచ్​.. విశేషాలివే!
సిట్రోయెన్​ సీ3 టాప్​ ఎండ్​ వేరియంట్​ లాాంచ్​.. విశేషాలివే!

సిట్రోయెన్​ సీ3 టాప్​ ఎండ్​ వేరియంట్​ లాాంచ్​.. విశేషాలివే!

Citroen C3 new variant launch : సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న సీ3కి కొత్త వేరియంట్​ను తాజాగా లాంచ్​ చేసింది సిట్రోయెన్​ సంస్థ. దీని పేరు సిట్రోయెన్​ సీ3 షైన్​. ఈ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.60లక్షలుగా ఉంది. ఈ మోడల్​ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

సిట్రోయెన్​ సీ3 షైన్​ విశేషాలు..

సిట్రోయెన్​ సీ3లో ఇప్పటికే రెండు వేరియంట్స్​ ఉన్నాయి. అవి లైవ్​, ఫీల్​. ఇక ఇప్పుడు షైన్​ పేరుతో మరో వేరియంట్​ను యాడ్​ చేసింది సిట్రోయెన్​. ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ వింగ్​ మిర్రర్స్​, రేర్​ పార్కింగ్​ కెమెరా, మేన్యువల్​ డే/ నైట్​ రేర్​ వ్యూ మిర్రస్​, ఫ్రెంట్​ ఫాంగ్​ ల్యాంప్స్​ వస్తున్నాయి. ఇప్పటివరకు లేని రేర్​ వైపర్​, వాషర్​, డీఫాగర్​ని కూడా యాడ్​ చేసింది.

Citroen C3 Shine launched : లైవ్​, ఫీల్​ వేరియంట్స్​లో అలాయ్​ వీల్స్​ అనేవి యాక్ససరీస్​ లిస్ట్​లో ఉండేవి. కాగా.. షైన్​ మోడల్​లో 15 ఇంచ్​ డైమెంట్​ కట్​ అలాయ్​ వీల్స్​ స్టాండర్డ్​గా వస్తున్నాయి. ఇక ఇప్పుడు సిట్రోయెన్​ సీ3లో మై సిట్రోయెన్​ కనెక్ట్​ యాప్​ ఉంది. ఇందులో 35కుపైగా కనెక్టివిటీ ఫీచర్స్​ లభిస్తున్నాయి.

సిట్రోయెన్​ సీ3 షైన్​లో 1.2 లీటర్​, 3 సిలిండర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ ఇంజిన్​ ఉంది. ఇది 82 హెచ్​పీ పవర్​ను, 115 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ గేర్​బాక్స్​ కూడా ఉంటుంది.

Citroen C3 Shine on road price in India : టాటా పంచ్​, మారుతీ సుజుకీ ఇగ్నిస్​, రెనాల్ట్​ కైగర్​, నిస్సాన్​ మాగ్నైట్​కు ఇప్పటికే గట్టిపోటీనిస్తోంది సిట్రోయెన్​ సీ3. ఇక కొత్త వేరియంట్​తో ఈ పోటీ మరింత పెరగనుంది.

7 సీటర్​ సిట్రోయెన్​ సీ3.. లాంచ్​కు రెడీ!

ఇండియా మార్కెట్​లోకి 7 సీటర్​ ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు సిట్రోయెన్​ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది సిట్రోయెన్​ సీ3కి 7 సీటర్​ వర్షెన్​ అని తెలుస్తోంది. సీ5 ఎయిర్​క్రాస్​, సీ3లతో ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది సిట్రోయెన్​. ఇటీవలే ఈసీ3 పేరుతో ఈవీని లాంచ్​ చేసింది. ఇక ఇప్పుడు 7 సీటర్​ ఎస్​యూవీ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ 7 సీటర్​ ఎస్​యూవీ ఫ్రెంట్​ డిజైన్​.. సీ3ని పోలి ఉండొచ్చు. బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైట్స్​, డీఆర్​ఎల్స్​, క్లామ్​షెల్​ బానెట్​, స్లీక్​ గ్రిల్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, రేక్​డ్​ విండ్​స్క్రీన్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​ వంటివి లభించనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం