తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Mileage Bikes : ఈ బైకులు మైలేజీలో కిర్రాక్.. ఫుల్ ట్యాంక్‌తో ఈజీగా హైదరాబాద్ టూ వైజాగ్ వెళ్లొచ్చు

Top Mileage Bikes : ఈ బైకులు మైలేజీలో కిర్రాక్.. ఫుల్ ట్యాంక్‌తో ఈజీగా హైదరాబాద్ టూ వైజాగ్ వెళ్లొచ్చు

Anand Sai HT Telugu

13 October 2024, 18:02 IST

google News
    • Top Mileage Bikes : మిడిల్ క్లాస్‌ వాళ్లు మైలేజీ ఇచ్చే బైకుల కోసం చూస్తుంటారు. బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్పోర్ట్ బైకులు మైలేజీలో తోపులు. మైలేజీ పరంగా మధ్యతరగతివారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.
టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్

భారత్‌లో మధ్యతరగతివారు ఎక్కువగా చూసేది.. మైలేజీ ఇచ్చే బైకులు. ఎందుకంటే ఇంధనం ధరలు పెరగడంతో అందరికీ భారంగా మారింది. దీంతో మైలేజీ ఇచ్చే బైకులవైపు ఎక్కువగా చూస్తున్నారు. కొన్ని బైకులు నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే రెండు బైకులు ఉన్నాయి. వాటికి నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే. అలాంటి కస్టమర్ల కోసం ప్రముఖ కంపెనీలు ప్రత్యేకంగా టూ వీలర్స్ తయారుచేస్తున్నాయి. మంచి మైలేజీని ఇచ్చే రెండు బైకుల గురించి చూద్దాం..

మైలేజీ ఇచ్చే బైకులు సాధారంగా బరువు కూడా తక్కువగా ఉంటాయి. వాటి టైర్లు కూడా సన్నగా ఉంటాయి. ఇంజిన్‌పై ఒత్తిడి తక్కువగానే ఉంటుంది. అలాంటి మోటర్ సైకిళ్లు గరిష్ట మైలేజీని కూడా ఇస్తాయి. ఇతర మోటర్ సైకిళ్లతో పోలిస్తే బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్పోర్ట్ మంచి పనితీరును కనబరుస్తాయి. కస్టమర్లకు తక్కువ ఖర్చుతో బైకులను మెయింటెన్ చేయవచ్చు. ఈ బైకుల ఫుల్ ట్యాంక్ చేయిస్తే.. హైదరాబాద్ టూ వైజాగ్ ఈజీగా వెళ్లవచ్చు. ఈ రెండు బైకుల గురించి చూద్దాం..

టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ కంపెనీకి భారీ విక్రయాలు తెచ్చి పెట్టే బైక్‌ టీవీఎస్ స్పోర్ట్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.65,625 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 నుంచి 80 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో 10 లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంక్ వస్తుంది. దాని ట్యాంక్ నిండితే.. సుమారు 700 నుంచి 750 కిలో మీటర్ల వరకు వస్తుంది. ఇది 109.7సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ బీఎస్ 6 ఇంజన్‌తో 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేస్తారు. దీని ఇంజన్ 8.07 పీఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్‌లతో వస్తాయి.

బజాజ్ ప్లాటినా

బజాజ్ ప్లాటినా బైక్ ధర రూ.68,685 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మైలేజీ విషయానికి వస్తే ఇది 72 కెఎంపిఎల్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌లో కస్టమర్‌లకు 11 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో అది 792 కిలో మీటర్ల మైలేజీ వస్తుంది. 102 సీసీ సింగిల్ సిలిండర్ డీటీఎస్-I ఇంజిన్‌తో ఆధారితం. ఇది 7.79 బీహెచ్‌పీ శక్తిని, 8.34 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

ఈ రెండు బైకులు అధికంగా మైలేజీ ఇచ్చే బైకులుగా ఉన్నాయి. ఆయా కంపెనీలు ఈ మేరకు వివరాలు వెల్లడించాయి. ఈ బైకుల ఎక్స్ షోరూమ్ ధరగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం