టీవీఎస్ మోటార్ నమ్మకమైన ద్విచక్ర వాహనాల కంపెనీ. దసరా, దీపావళి పండుగలకు కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆఫర్లు ప్రకటించింది. రూ.30,000 వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను ప్రకటించింది. ఈ-స్కూటర్‌ను సుమారు రూ.89,999 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‌ను తీసుకునే కస్టమర్‌లు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనం పొందుతారు. రూ.5,999 ధరతో 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీ కూడా అందుబాటులో ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర కొనుగోలుదారులు మాత్రమే ఆఫర్‌ను పొందవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ 2.2 KWh వేరియంట్ రూ.17,300, టీవీఎస్ ఐక్యూబ్ 3.4 KWh వేరియంట్‌పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్/క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఈ స్కూటీ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే రూ.7,999 డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా ఐక్యూబ్ ఈ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.2,399 నుండి ప్రారంభమవుతుంది. అయితే అన్ని ఆర్థిక ప్రయోజనాలు అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
సరికొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టీఎఫ్‌టీ స్క్రీన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా అనేక అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఈ స్కూటర్ వేరియంట్ 3.4 KWh బ్యాటరీని పొందుతుంది. దీని ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఫుల్ ఛార్జింగ్‌తో 75 నుంచి 100 కిలోమీటర్లు నడుస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.46 లక్షలు. పూర్తిగా ఛార్జ్ చేస్తే 75-100 కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది.
టీవీఎస్ మోటార్ ప్రకటించిన ఈ ఆర్థిక ప్రయోజనాలతో దసరా, దీపావళి పండుగలకు కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కస్టమర్లకు ఇది వరంగా మారనుంది. ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దగ్గరలోని షోరూమ్ సందర్శించండి.