Bajaj Pulsar N125 : సూపర్​ స్టైలిష్​ బజాజ్​ పల్సర్​ ఎన్​125- త్వరలోనే లాంచ్​!-bajaj to launch new bike on october 16 is this the new pulsar n125 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Pulsar N125 : సూపర్​ స్టైలిష్​ బజాజ్​ పల్సర్​ ఎన్​125- త్వరలోనే లాంచ్​!

Bajaj Pulsar N125 : సూపర్​ స్టైలిష్​ బజాజ్​ పల్సర్​ ఎన్​125- త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Oct 13, 2024 07:15 AM IST

ఓ కొత్త బైక్​ని లాంచ్​ చేసేందుకు బజాజ్​ ఆటో రెడీ అవుతోంది. ఈ నెల 16న లాంచ్​ ఈవెంట్​ని ఫిక్స్​ చేసింది. ఈ ఈవెంట్​లో బజాజ్​ పల్సర్​ ఎన్​125ని లాంచ్​ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

బజాజ్​ పల్సర్​ ఎన్​125 వచ్చేస్తోంది..
బజాజ్​ పల్సర్​ ఎన్​125 వచ్చేస్తోంది..

బజాజ్​ ఆటో ప్రాడక్ట్స్​లో పల్సర్​ మోడల్స్​కి క్రేజీ డిమాండ్​ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్​ని సంస్థ తీసుకొస్తుంటుంది. పాత మోడల్స్​ని ఎప్పటికప్పుడు అప్డేట్​ చేస్తుంది. ఇక ఇప్పుడు మార్కెట్​లోకి కొత్త పల్సర్​ని లాంచ్​ చేసేందుకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ సిద్ధమవుతోందని సమాచారం. 2024 అక్టోబర్​ 16న ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. కంపెనీ తన కొత్త ఆఫర్ గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ, ఇది కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 కావచ్చని రూమర్స్​ ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ సిరీస్.. బైక్ తయారీదారుకు అత్యంత సక్సెస్​ఫుల్​. ఇక ఈ కొత్త బైక్​.. 'ఎన్' శ్రేణిలో అత్యంత సరసమైన ఆఫర్​గా నిలుస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ బజాజ్​ పల్సర్​ ఎన్​125 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బజాజ్ పల్సర్ ఎన్​125..

బజాజ్ ఆటో ఈ నెక్ట్స్​ పల్సర్​ను "ఆహ్లాదకరమైన, చురుకైన, అర్బన్" రైడ్​ అని పిలుస్తోంది. ఇది తక్కువ సామర్థ్యం కలిగిన ఆఫర్​ను సూచిస్తుంది. ఇది పల్సర్ ఎన్​125 అని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే పల్సర్ ఎన్160, ఎన్250 బైక్స్​ని రిటైల్ చేస్తోంది. ఈ రెండూ ప్రయాణీకులకు ఫ్రెండ్లీ బైక్స్​గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లతో కూడిన ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ ల్యాంప్, ట్విన్-స్పోక్ అల్లాయ్ వీల్స్, చిసెల్డ్ ఫ్యూయల్ ట్యాంక్ తో సహా పెద్ద పల్సర్ ఎన్ మోడళ్లకు అనుగుణంగా ఈ కొత్త బైక్​లో స్టైలింగ్ ఉంటుందని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ ఎన్125 బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆల్-డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​ని కూడా పొందే అవకాశం ఉంది. స్ప్లిట్ సీట్లు, ఎలఈడీ టెయిల్​లైట్​తో పాటు మరెన్నో ఫీచర్స్​ ఇందులో ఉంటాయని సమాచారం. పల్సర్ 125 బైకులో ఉన్న 125సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్​ని ఇందులో ఫిక్స్​ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. పల్సర్ ఎన్125కు స్పోర్టీ టచ్ తీసుకురావడానికి ఇంజిన్ మార్పులు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో 5-స్పీడ్ గేర్ బాక్స్​తో బైక్​ని కనెక్ట్​ చేయవచ్చు. ఈ బైక్ కాంబి బ్రేకింగ్​ను కలిగి ఉంటుంది. బజాజ్ సింగిల్-ఛానల్ ఏబీఎస్​ను టాప్​ ఎండ్​ వేరియంట్​లో అందించవచ్చు.

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని బైక్​ సెగ్మెంట్​కి మంచి డిమాండ్​ ఉంది. మరీ ముఖ్యంగా 125 సీసీ సెగ్మెంట్​లో విపరీతమైన పోటీ కనిపిస్తోంది. 125 సీసీ స్పోర్ట్స్ కమ్యూటర్ సెగ్మెంట్ ఇటీవల కొన్ని మంచి లాంచ్​లను చూసింది. రాబోయే బజాజ్ పల్సర్ ఎన్​125.. హీరో ఎక్స్​ట్రీమ్ 125 ఆర్, టీవీఎస్ రైడర్ 125, బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎనజీలతో పోటీ పడుతుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఆఫర్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ధర, మైలేజ్​తో పాటు అన్ని వివరాలు లాంచ్​ టైమ్​కి తెలుస్తాయి. వాటిని మీకు మేము అప్డేట్​ చేస్తాము.

Whats_app_banner

సంబంధిత కథనం