Bajaj Pulsar : ఈ పండుగ సీజన్‌లో బజాజ్ పల్సర్ కొనుగోలు చేస్తే 10 వేల రూపాయల వరకు ఆదా
Bajaj Pulsar : బజాజ్ పల్సర్‌కు మంచి డిమాండ్ ఉంది. మీరు కూడా ఈ బైక్ కొనాలి అనుకుంటే ఇప్పుడు మంచి అవకాశం. పండుగ ఆఫర్లలో భాగంగా పదివేల రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు.
చాలా మంది దసరా, దీపావళి పండుగ సీజన్లలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆటో తయారీదారులు కూడా ఈ సమయంలో ఆకర్షణీయమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను ప్రకటిస్తాయి. అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది ఆఫర్లను ప్రకటించాయి. బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది. బజాజ్ ఆటో కూడా పల్సర్ బైకులపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. బజాజ్ పండుగ ఆఫర్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
2001లో ప్రారంభమైన పల్సర్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా ఉంది. ఇది అన్ని రకాల కస్టమర్‌లను ఆకట్టుకుంటుంది. పల్సర్ బైక్‌లు 125 సిసి నుండి 400 సిసి వరకు వివిధ విభాగాలలో అందుబాటులో ఉన్నాయి. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పల్సర్ బైక్‌లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది బజాజ్.
పల్సర్ బైకుల ఎక్స్-షోరూమ్ ధరపై రూ.10,000 తగ్గింపు ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పండుగ సీజన్‌లోనూ విక్రయాల్లో రికార్డు వృద్ధిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మీరు పల్సర్ బైక్‌లను కొనుగోలు చేయడం ద్వారా రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్, NS125, N150, N160, NS200, N250లను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈ రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్‌కు అర్హులు.
ఇది కాకుండా బజాజ్ ఆటో లిమిటెడ్ పిరియడ్‌లో భాగంగా 5,000 రూపాయల నగదు తగ్గింపును కూడా ప్రకటించింది. ఈ పరిమిత కాల క్యాష్‌బ్యాక్ ఆఫర్ రూ. 5,000ని పొందాలంటే డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లోని పైన్ ల్యాబ్స్ మెషీన్‌ల ద్వారా HDFC క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి లావాదేవీలు చేయాలి. ఈ రెండు క్యాష్ డిస్కౌంట్లను కలిపితే రూ. 10,000 వరకు ఆదా చేసుకుని పల్సర్ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పల్సర్ బైక్‌లను కొనుగోలు చేసే వారు ఈ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు అందించే ఆఫర్‌లను పొందవచ్చు. పండుగ సీజన్‌కు ముందు బజాజ్ పల్సర్ బైక్‌లపై ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.
'మా విలువైన కస్టమర్లకు ఈ అద్భుతమైన పండుగ ఆఫర్‌ను అందించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. పల్సర్ బైకులు ఎల్లప్పుడూ స్టైల్, మంటి పనితీరుకు ఫేమస్. ఎక్కువ మంది కస్టమర్లు పల్సర్‌ను కొనుగోలు చేసేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాం.'అని బజాజ్ ఆటో మోటార్‌సైకిల్స్ బిజినెస్ హెడ్ సారంగ్ కనాడే అన్నారు.
బజాజ్ ఆటో పల్సర్ మొదటిసారిగా 2001లో విడుదలైంది. పల్సర్ దాని స్పోర్టియర్ డిజైన్, మంచి పనితీరు, సరసమైన ధర కారణంగా మంచి పేరు సంపాదించింది. 2024 పల్సర్ మోటార్‌సైకిళ్లు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, నావిగేషన్ సపోర్ట్ మరియు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లతో సహా అనేక అప్‌డేట్స్‌తో వచ్చాయి.