Oben Electric Discount : ఈ ఎలక్ట్రిక్ బైకులపై భారీ డిస్కౌంట్.. ఐదేళ్ల వారంటీ.. ఐఫోన్ 15 గెలిచే ఛాన్స్-oben rorr electric motorcycle gets huge discount and chance to win iphone 15 ipad mini and sony headphones ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oben Electric Discount : ఈ ఎలక్ట్రిక్ బైకులపై భారీ డిస్కౌంట్.. ఐదేళ్ల వారంటీ.. ఐఫోన్ 15 గెలిచే ఛాన్స్

Oben Electric Discount : ఈ ఎలక్ట్రిక్ బైకులపై భారీ డిస్కౌంట్.. ఐదేళ్ల వారంటీ.. ఐఫోన్ 15 గెలిచే ఛాన్స్

Anand Sai HT Telugu
Sep 26, 2024 08:00 AM IST

Oben Electric Discount : కారు, బైకు తయారీ కంపెనీలు దసరా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఒబెన్ ఎలక్ట్రిక్ సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైకులపై మంచి డిస్కౌంట్‌తోపాటుగా బహుమతులు గెలిచే ఛాన్స్ ఇస్తోంది.

ఒబెన్ రోర్ డిస్కౌంట్
ఒబెన్ రోర్ డిస్కౌంట్

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన ఒబెన్ రోర్ ధర కేవలం రూ. 1,19,999 లక్షలు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయడానికి గోల్డెన్ ఛాన్స్ అందిస్తుంది. అంతేకాదు ప్రతి మోటార్‌సైకిల్ కొనుగోలుపై 5 సంవత్సరాల వారంటీ, ఐఫోన్ 15, ఐపాడ్ మినీ, సోనీ హెడ్‌ఫోన్‌లను గెలుచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఒబెన్ రోర్ అసలు ధర రూ. 1,49,999 (ఎక్స్-షోరూమ్) ధర తగ్గింపుతో రూ. 30,000 ఆదా అవుతుంది. దీనిపై మెుత్తం 60 వేల వరకు పొదుపు పొందగలరని కంపెనీ చెబుతోంది. దసరా పండుగను పురస్కరించుకుని, బెంగుళూరు, దిల్లీ, పూణేలోని తమ షోరూమ్‌లలో ప్రత్యేకంగా దసరా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఒబెన్ ఎలక్ట్రిక్ తెలిపింది.

సెప్టెంబర్ 29న బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ షోరూమ్‌లో, అక్టోబర్ 2న ఢిల్లీలోని ద్వారకా షోరూమ్‌లో, అక్టోబర్ 6న పూణేలోని వాకాడ్ షోరూమ్‌లో ఈ ఈవెంట్‌లు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, CEO మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ..'మేం మా కస్టమర్‌లకు మరింత తక్కువ ధరతో బైకులను అందిస్తాం. దసరా ఆఫర్‌ను భారతీయ కస్టమర్లు జరుపుకొనేందుకు వీలు కల్పిస్తున్నాం. మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఉత్తమ ఎంపికగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.' అని చెప్పారు.

ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కస్టమర్‌లు ఒబెన్ ఎలక్ట్రిక్ EV మోటార్‌సైకిళ్లు కొనేలా చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఆకర్షణీయమైన తగ్గింపులు, ఆఫర్‌లను అందించడానికి ఆసక్తిగా ఉన్నామని ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మధుమిత అగర్వాల్ అన్నారు.

'ఈ పండుగ ప్రకటన ఒబెన్ ఎలక్ట్రిక్ విస్తరణ ప్రణాళికలలో భాగం. రాబోయే నెలల్లో ప్రధాన భారతీయ నగరాల్లో 60 కొత్త షోరూమ్‌లను ప్రారంభించబోతున్నాం. బెంగుళూరు, పూణే, దిల్లీ, కేరళలో బలమైన ఉనికితో ఒబెన్ ఎలక్ట్రిక్ విస్తరిస్తూనే ఉంది.' అని మధుమిత అగర్వాల్ చెప్పారు.