Devara Pre Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్.. నెటిజన్ల విమర్శలు-jr ntr devara movie pre release event cancelled due to overcrowd and confusion ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Pre Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్.. నెటిజన్ల విమర్శలు

Devara Pre Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్.. నెటిజన్ల విమర్శలు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2024 09:32 PM IST

Devara Pre Release Event: దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అభిమానులు భారీగా తరలిరావటంతో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో గందగోళం ఏర్పడింది. చివరికి రద్దయింది.

Devara Pre Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్.. నెటిజన్ల విమర్షలు
Devara Pre Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్.. నెటిజన్ల విమర్షలు

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఈ ఈవెంట్‍లో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడతారా అని ఎదురుచూసిన అభిమానులు, సినీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. నేడు (సెప్టెంబర్ 22) జరగాల్సిన దేవర ఈవెంట్ రద్దయింది. ఇండోర్ ఈవెంట్‍కు అంచనాలకు మించి వేలాదిగా అభిమానులు రావటంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఆ వివరాలివే..

రచ్చరచ్చ.. లాఠీచార్జ్

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను నేటి సాయంత్రం హైదరాబాద్‍లోని నోవాటెల్ హోటల్‍లో నిర్వహించాలని మూవీ టీమ్ నిర్ణయించింది. ఈ మేరకు పాస్‍లను భారీగా జారీ చేసింది. అయితే, ఈ ఇండోర్ ఈవెంట్‍కు జనాలు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా వచ్చారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. చాలాసేపు ఎదురుచూడాల్సి రావటంతో కొందరు అసహనం వ్యక్తం చేశారు.

అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్‍లోకి దూసుకొచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడింది. జనాలను అదుపు చేసేందుకు పోలీసులు కాస్త లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈవెంట్ జరగాల్సిన హాల్ నిండిపోయినా చాలా మంది బయటే ఉండిపోయాల్సి వచ్చింది. ఈ క్రమంలో హోటల్‍కు సంబంధించిన ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయింది.

ఈవెంట్ రద్దు

మొత్తంగా దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన నోవాటెల్ హోటల్ వద్ద రచ్చరచ్చ జరిగింది. వేలాది మంది అభిమానులు తరలిరావటంతో మూవీ యూనిట్‍కు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాలేదు. దీంతో ఈవెంట్ జరిపే పరిస్థితులు ఏ మాత్రం కనిపించలేదు. దీంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను క్యాన్సిల్ చేసేశారు నిర్వాహకులు.

నెటిజన్ల విమర్శలు

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇండోర్ ఈవెంట్‍కు కూడా ఓ లెక్క లేకుండా ఇష్టానుసారంగా పాస్‍లు జారీ చేయటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. సరైన ప్లానింగ్ లేని కారణంగా రచ్చ జరిగిందని అంటున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ దేవరపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన చిత్రం కావటంతో దేవరపై హైప్ మరింత ఎక్కువగా ఉంది. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ అదిరిపోగా.. నేడు (సెప్టెంబర్ 22) మరో ట్రైలర్ కూడా వచ్చింది. యాక్షన్‍తో విశ్వరూపం చూపారు ఎన్టీఆర్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో దేవర రిలీజ్ అవుతోంది.

దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. విలన్ పాత్ర పోషించారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన మూడు పాటలు పాపులర్ అయ్యాయి. ట్రైలర్లలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేశాయి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు.

Whats_app_banner