WhatsApp encryption case : ‘ఇండియా నుంచి వెళ్లిపోతాము’- కోర్టు ఎదుట వాట్సాప్ ఘాటు వ్యాఖ్యలు!
26 April 2024, 12:11 IST
WhatsApp encryption : కొత్త ఐటీ రూల్స్‌పై వాట్సాప్ పోరాటం చేస్తోంది! ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలని ఆదేశాలిస్తే.. ఇండియాను వదిలేసి వెళ్లిపోతామని.. తాజాగా దిల్లీ ప్రభుత్వానికి చెప్పింది.
'ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే.. ఇండియాను వదిలేస్తాము'
WhatsApp encryption case : మెసేజ్‌లు, కాల్స్‌కు సంబంధించిన ఎన్క్రిప్షన్ విషయంలో.. దిల్లీ హైకోర్టు ఎదుట బలమైన వ్యాఖ్యలు చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్. ఎన్క్రిప్షన్ని తొలగించాలని ఆదేశాలిస్తే.. తాము ఇండియా నుంచి వెళ్లిపోతామని పేర్కొంది.
'ప్రపంచంలో ఇలా ఎక్కడా లేదు..'
"ఒక ప్లాట్‌ఫామ్‌గా చెబుతున్నాము.. ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలని చెబితే మాత్రం.. ఇండియాను వదిలేసి వెళ్లిపోతాము," అని.. ఐటీ రూల్స్ సవరణకు సంబంధించిన కేసులో వాట్సాప్ పేర్కొంది.
ఐటీ నిబంధనలకు సంబంధించిన సవరణలను.. ఎవరితోనూ చర్చించకుండా తీసుకున్నారని, ఈ సవరణలు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఉన్నాయని.. వాట్సాప్ తరఫున దిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది తేజస్ కారియా అన్నారు. పటిష్టమైన ఎన్క్రిప్షన్ వ్యవస్థ ఉండటం వల్లే.. చాలా మంది వాట్సాప్‌ని వాడుతున్నారని గుర్తు చేశారు. అంతేకాదు.. ఈ కొత్త రూల్స్ అనేవి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి రూల్స్.. ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. ఒక వేళ ఈ రూల్స్ పాటించాల్సి వస్తే.. ఏ మెసేజ్‌లను డీక్రిప్ట్ చేయాలో తెలియక చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, కోట్లాది మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి వస్తుందని వాట్సాప్ తరఫున వాదించారు న్యాయవాది.
WhatsApp encryption India : కొత్త ఐటీ రూల్స్.. ప్రైవసీ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ.. వాట్సాప్‌తో పాటు మరో మెటా ఆధారిత సోషల్ మీడియా ఫేస్బుక్ కూడా కోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్లను.. భారత దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వ్యతిరేకించింది. తిరిగి.. వాట్సాపైనే ఆరోపణలు చేసింది. వివాదాలు ఎదురైతే.. వాటిని పరిష్కరించుకునేందుకు యూజర్లకు అసలు ఎలాంటి మెకానిజం ఇవ్వకుండా.. వాట్సాప్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టుకు చెప్పింది. ఈ కొత్త రూల్స్‌ని అమలు చేయలేకపోతే.. ఫేక్ మెసేజ్‌లను నియంత్రచం కష్టమవుతుందని పేర్కొంది. ఫలితంగా.. ఇలాంటి మెసేజ్‌లు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని వెల్లడించింది.
కానీ ఎన్కిప్షన్ విషయంలో మాత్రం.. వాట్సాప్ చాలా బలంగా స్టేట్మెంట్స్ ఇస్తోంది.
"ఛాట్స్‌ని ట్రేస్ చేయాలని మెసేజింగ్ యాప్స్‌కి చెప్పడం అనేది.. వాట్సాప్‌లో ప్రతి మెసేజ్‌ని చూడటటమే. అది మా ఎండ్ టు ఎండ్ ఎన్కిప్షన్ పాలసీకి విరుద్ధం. ప్రజల ప్రైవసీ హక్కులకు విరుద్ధం," అని గతంలో చెప్పుకొచ్చింది వాట్సాప్.
New IT rules WhatsApp : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఫ్రేమవర్క్ని సిద్ధం చేసింది కేంద్రం. సమాచారం అనేది మొదట ఎక్కడ పుట్టుకొచ్చిందో, సంబంధిత ఆరిజినేటర్ వివరాలను సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ వెల్లడించాలని ఆ రూల్స్‌లో ఉన్నాయి.