WhatsApp new feature : ఇక ఇంటర్నెట్ లేకపోయినా.. వాట్సాప్‌లో ఫొటోలు షేర్ చేయొచ్చు!
WhatsApp new update : ఇక ఇంటర్నెట్ లేకుండానే.. వాట్సప్‌లో ఫొటోలు, మీడియా ఫైల్స్‌ని షేర్ చేసుకోవచ్చు! ఈ మేరకు.. ఒక కొత్త ఫీచర్‌ని రూపొందిస్తోంది వాట్సాప్. ఆ వివరాలు..
WhatsApp latest features : దిగ్గజ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్.. ఒక కొత్త ఫీచర్‌ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే.. ఇక ఇంటర్నెట్ లేకుండానే.. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి మీడియా ఫైల్స్‌ని షేర్ చేసుకోవచ్చని సమాచారం. ఈ ఫీచర్‌కి సంబంధించి, ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ షేరు చేసుకోవచ్చు..!
వాబీటాఇన్ఫో ప్రకారం.. ఈ వాట్సాప్ కొత్త ఫీచర్.. షేరిట్ వంటి బ్లూటూత్ ఎనేబుల్డ్ యాప్స్లాగానే పనిచేస్తుంది. అంటే.. వినియోగదారులు.. తమ ఫోన్లోని బ్లూటూత్ ఆన్ చేయాలి. ఫలితంగా.. ఆఫ్‌లైన్ షేరింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. బ్లూటూత్‌లో మన సమీపంలోని డివైజ్‌లను ట్రేస్ చేసి, ఫైల్స్‌ని షేర్ చేసే వెసులుబాటు ఉంటుంది కది. వాట్సాప్ కొత్త ఫీచర్ కూడా ఇలాగే పనిచేస్తుంది.
ఇలా సమీపంలోని డివైజ్‌లను ట్రేస్ చేయాలంటే.. స్మార్ట్‌ఫోన్‌లోని సిస్టెమ్ ఫైల్స్, ఫొటో గ్యాలరీకి సంబంధించిన పర్మీషన్స్ వాట్సాప్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో.. చుట్టుపక్కన ఏవైనా డివైజ్‌లు ఉన్నాయా? అని చూసేందుకు.. లొకేషన్ పర్మీషన్‌ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
WhatsApp photo sharing without internet : మరి ఇంటర్నెట్ లేకుండా చేసే ఫైల్స్ ట్రాన్స్ఫర్ సేఫ్‌గా ఉంటుందా? అంటే.. కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఇలా షేర్ చేసే ఫైల్స్‌కి కూడా ఎన్క్రిప్షన్స్ ఉంటాయని, డేటా సేఫ్‌గా ఉంటుందని సమాచారం. ఎవరూ టాంపర్ చేయలేరని తెలుస్తోంది.
ఇలా ఇంటర్నెట్ లేకుండా ఫొటోలు, మీడియా ఫైల్స్ షేర్ చేసుకునే వెసులుబాటును కల్పించే ఈ వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ప్రస్తుతం ఈ ఫఈచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఫలితంగా.. త్వరలోనే ఇది యూజర్స్‌కు కూడా అందుబాటులోకి రావొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
WhatsApp news feature : ఇంటర్నెట్తో పాటు వాట్సాప్ కూడా ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న వారిలో దాదాపు ప్రతి ఒక్కరు ఈ మెటా ఆధారిత సోషల్ మీడియాని వాడుతుంటారు. నిత్యం, ఫొటోలు, మీడియా ఫైల్స్‌ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంటర్నెట్ లేకుండా కూడా షేర్ చేసుకోవచ్చంటే.. ఇది వాట్సాప్ కొత్త ఫీచర్ కచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత కథనం