WhatsApp new feature : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక ఎంత ప్రయత్నించినా ‘అది అవ్వదమ్మ..’
WhatsApp latest privacy feature : యూజర్స్ ప్రైవసీకి సంబంధించి.. ఓ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది వాట్సాప్. అది అందుబాటులోకి వస్తే.. ఇక ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ఉండదు!
WhatsApp new feature : యూజర్స్‌ని ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది.. దిగ్గజ సామాజిక మాధ్యమం వాట్సాప్. అంతేకాకుండా.. కస్టమర్ల ప్రైవసీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో.. ఈ మెటా ఆధారిత వాట్సాప్.. ఓ కొత్త ప్రైవసీ ఫీచర్‌ని తీసుకురాబోతోందని సమాచారం. ఈ ఫీచర్ ద్వారా.. యాప్‌లోని ప్రొఫైల్ ఫొటోలను ఇక స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ఉండదు!
వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్..
వాట్సాప్‌లో ప్రొఫైల్ ఫొటో సేవింగ్, డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. ఇక ఇప్పుడు.. మరో అడుగు ముందుకేసి, ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్ షాట్ కూడా తీసుకోనివ్వకుండా చూస్తోంది! ఈ ఫీచర్.. వాట్సాప్ బీటా వర్షెన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ పేరు ఇంకా రివీల్ అవ్వలేదు కానీ.. ఎవరైనా స్క్రీన్‌షాట్ తీసేందుకు ప్రయత్నిస్తుంటే.. అది జరగకపోగా, ఓ వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుందట! అనుమతి లేకుండా.. ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకోనివ్వకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని సోషల్ మీడియా సైట్ భావిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.
WhatsApp latest privacy feature : ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త ఫీచర్ వచ్చినా, 100 పర్సెంట్ సేఫ్ అనుకోవడానికి లేదు. ప్రొఫైల్ ఫొటోలను సేవ్, డౌన్లోడ్ చేసుకోలేకపోవచ్చు, స్క్రీన్‌షాట్ తీసుకోలేకపోవచ్చు కానీ.. ఇతర ఫొన్ నుంచి సంబంధిత ప్రొఫైల్ ఫొటోను క్యాప్చర్ చేసుకోవచ్చు!
అయితే.. వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్‌లో ఇప్పటికే కొన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మన ప్రొఫైల్ ఫొటోని ఎవరు చూడొచ్చు? ఎవరు చూడకూడదు? అనది మనమే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది.. ప్రైవసీ సెట్టింగ్స్ మెన్యూలో ఉంటుంది.
వాట్సాప్‌లో ‘ఫేవరెట్ కాంటాక్ట్స్’ ఫీచర్..!
WhatsApp latest news : వాట్సాప్.. ఓ కొత్త ఫీచర్‌ని త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఫీచర్ పేరు 'ఫేవరెట్ కాంటాక్ట్స్'. సాధారణంగా.. ఫోన్ కాంటాక్ట్స్‌లో ఫేవరెట్స్, స్పీడ్ డయల్స్ వంటివి ఉంటాయి. అదే విధంగా.. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌లో కూడా మనం మన ఫేవరెట్ కాంటాక్ట్స్ లిస్ట్‌ని తయారు చేసుకోవచ్చట. అయితే.. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం