Tecno Pop 9 5G: రూ. 9 వేల లోపు ధరలో, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో, టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్
24 September 2024, 18:27 IST
Tecno Pop 9 5G launch: 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఎన్ఎఫ్సీ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో టెక్నో పాప్ 9 5జీని భారత్ లో లాంచ్ చేసింది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ను అత్యంత కాంపిటీటివ్ ధర అయిన రూ.8,499 కే అందిస్తున్నారు. ఈ ఫోన్ సేల్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది.
టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్
Tecno Pop 9 5G launch: పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్ ను టెక్నో సంస్థ భారత్ లో లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఎన్ఎఫ్సీ సపోర్ట్ తో సహా చెప్పుకోదగిన ఫీచర్లను అందించే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ద్వారా టెక్నో భారతదేశంలో తన లైనప్ ను మరింత విస్తరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో టెక్నో పాప్ 8 మోడల్ ను ప్రవేశపెట్టింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో పని చేసే టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ప్రి-బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తరువాత, అక్టోబర్ 7 నుంచి అధికారికంగా సేల్ ప్రారంభమవుతుంది. టెక్నో పాప్ 9 5జీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. ఈ రెండు వెర్షన్లను ప్రస్తుతం అమెజాన్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అమ్మకాలు అక్టోబర్ 7 నుండి ప్రారంభమవుతాయి. అప్పుడు స్పెషల్ ఇంట్రడక్టరీ ధరలను ప్రకటిస్తారు.
రూ.499 చెల్లించి ప్రి-బుకింగ్
కస్టమర్లు రూ.499 డిపాజిట్ గా చెల్లించి ఈ ఫోన్ ను ప్రి-బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన తరువాత, అమెజాన్ పే బ్యాలెన్స్ లో ఈ మొత్తాన్ని అమెజాన్ రీఫండ్ చేస్తుంది. అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్నైట్ షాడో అనే మూడు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది.
టెక్నో పాప్ 9 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
టెక్నో (Tecno) పాప్ 9 5జీ డ్యూయల్ సిమ్ (నానో+నానో)ను సపోర్ట్ చేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఎల్ సిడి స్క్రీన్ ఉంటుంది. అయితే ఖచ్చితమైన డిస్ ప్లే పరిమాణం వెల్లడించబడలేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. వెనకవైపు 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 582 సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో డ్యూయల్ స్పీకర్లతో ఆడియో క్వాలిటీ పెరుగుతుంది.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్ లో 18వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫ్రారెడ్ (IR) ట్రాన్స్మిటర్ కూడా ఉంది, దుమ్ము మరియు స్ప్లాష్ల నుండి రక్షణ కోసం ఐపి 54 రేటింగ్ ఉంది. ఈ ధర విభాగంలో ఎన్ఎఫ్సీ సపోర్ట్ ఉన్న కలిగి ఉన్న మొదటి 5 జీ స్మార్ట్ ఫోన్ గా నిలిచింది.
టాపిక్