రూ.20 వేలలోపు ధరతో శాంసంగ్ కొత్త ఫోన్.. ఒకేసారి ఫ్రంట్, బ్యాక్ కెమెరాలో వీడియో తీయోచ్చు
Samsung Galaxy M55s 5G Launched : శాంసంగ్ తన నూతన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం55ఎస్‌ను విడుదల చేసింది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఎంత ధరలో వస్తుంది? ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ లాంచ్ అయింది. శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం55ఎస్ మార్కెట్‌లోకి వచ్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేసే ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఈ ఫోన్ వెనుక భాగంలో ఉంది. కొత్త గెలాక్సీ ఎం55ఎస్ గత ఏడాది లాంచ్ అయిన గెలాక్సీ ఎం55 5జీ తర్వాతి వెర్షన్‌గా చెప్పవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర, అన్ని ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ ధర
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ వేరియంట్ ధర రూ.19,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీ వేరియంట్లలో కూడా ప్రవేశపెట్టారు. అయితే వాటి ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.
గెలాక్సీ ఎం55ఎస్ ఫోన్ సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
గెలాక్సీ ఎం55ఎస్ ఫీచర్లు
ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ సెట్, అడ్రినో 644 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
గెలాక్సీ ఎం55ఎస్‌లో 12 జీబీ వరకు ర్యామ్ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఈ ఫోన్ వన్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్లో స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్‌లో ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరాలు 30 ఎఫ్‌పీఎస్ వద్ద 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో కంపెనీ డ్యూయల్ రికార్డింగ్‌ను ఇచ్చింది. తద్వారా మీరు ఒకేసారి ముందు, వెనుక కెమెరాల నుండి వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇది బ్లాగర్లకు మంచి ఎంపికగా ఉంటుంది. తక్కువ వెలుతురులో ఫొటోలు, వీడియోలు తీయడానికి సహాయపడే నైటోగ్రఫీ ఆప్షన్ కూడా ఈ ఫోన్లో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 45వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మెరుగైన వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2, వై-ఫై 6లను తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుందని శాంసంగ్ తెలిపింది.