Samsung Galaxy S24: ఇలా చేస్తే.. నమ్మలేనంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ను సొంతం చేసుకోవచ్చు..-samsung galaxy s24 gets massive price cut in india check discount price and the way to grab the deal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S24: ఇలా చేస్తే.. నమ్మలేనంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ను సొంతం చేసుకోవచ్చు..

Samsung Galaxy S24: ఇలా చేస్తే.. నమ్మలేనంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ను సొంతం చేసుకోవచ్చు..

Sudarshan V HT Telugu
Sep 21, 2024 09:00 PM IST

శాంసంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 24 ధర భారీగా తగ్గింది. వినియోగదారులు ఇప్పుడు ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అందుకు మీరేం చేయాలంటే..?

నమ్మలేనంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24
నమ్మలేనంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (Aishwarya Panda/HT Tech)

తమ ఫ్లాగ్ షిప్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 24 ధరను శాంసంగ్ భారీగా తగ్గించింది. భారతదేశంలో ఈ ప్రీమియం ఫోన్ ఇప్పుడు రూ.59,999 ధరకు లభిస్తుంది. క్యాష్ బ్యాక్స్, బ్యాంక్స్ డిస్కౌంట్స్ అదనం. ఇది లిమిటెడ్ టైమ్ ఫెస్టివల్ ఆఫర్ అని శామ్సంగ్ చెబుతోంది.

రూ. 12 వేల ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్

ఈ ప్రమోషనల్ డీల్ లో భాగంగా శాంసంగ్ రూ.12,000 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అదనంగా, వినియోగదారులు అప్ గ్రేడ్ బోనస్ లేదా రూ .3,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్ (CASH BACK) పొందవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్ ఫోన్ 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లో కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను శాంసంగ్ ప్రారంభంలో రూ.74,999 గా నిర్ణయించింది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ధరను కూడా తగ్గించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 లో 2,340×1,080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో, 120 హెర్ట్జ్, హెచ్డిఆర్ 10+ రిఫ్రెష్ రేటుతో 6.2 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే ఉంది. ఈ రిఫ్రెష్ రేటు 1 హెర్ట్జ్, 120 హెర్ట్జ్ మధ్య డైనమిక్ గా అడ్జస్ట్ అవుతుంటుంది. 2600 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ తో ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే మరింత మన్నికను, స్పష్టతను అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 కెమెరా

శాంసంగ్ (SAMSUNG) గెలాక్సీ ఎస్ 24 లో మల్టీ-డైరెక్షనల్ పిడిఎఎఫ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) వంటి ఫీచర్లతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ సెన్సార్ ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ తో కూడిన 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎక్సినోస్ 2400 చిప్ సెట్ పై పనిచేస్తుంది. యుఎస్, కెనడా మోడళ్లు మాత్రం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తాయి. 128 జీబీ, 256 జీబీ లేదా 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు. 25వాట్ వైర్డ్, 15వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలతో పాటు 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ (smartphone) పనిచేస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ తో డ్యూయల్ స్పీకర్లు, ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, వై-ఫై 6ఈ, 5జీ, ఎల్టీఈ, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.3, వై-ఫై డైరెక్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.