Tecno Spark 20 4G : టెక్నో స్పార్క్​ 20 లాంచ్​కు రెడీ.. ఫీచర్స్​ ఇవే!-tecno spark 20 4g design and specifications leaked see details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tecno Spark 20 4g : టెక్నో స్పార్క్​ 20 లాంచ్​కు రెడీ.. ఫీచర్స్​ ఇవే!

Tecno Spark 20 4G : టెక్నో స్పార్క్​ 20 లాంచ్​కు రెడీ.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Nov 26, 2023 03:30 PM IST

Tecno Spark 20 4G : టెక్నో స్పార్క్​ 20 4జీ మొబైల్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

టెక్నో స్పార్క్​ 20 లాంచ్​కు రెడీ.. ఫీచర్స్​ ఇవే!
టెక్నో స్పార్క్​ 20 లాంచ్​కు రెడీ.. ఫీచర్స్​ ఇవే! (Representative image)

Tecno Spark 20 4G : టెక్నో సంస్థ నుంచి మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. దీని పేరు టెక్నో స్పార్క్​ 20. ఇందులో రెండు గ్యాడ్జెట్స్​ ఉండనున్నాయి. అవి.. టెక్నో స్పార్క్​ 20, టెక్నో స్పార్క్​ 20సీ. ఈ రెండు కూడా 4జీ స్మార్ట్​ఫోన్స్​. తొలుత.. టెక్నో స్పార్క్​ 20 4జీ లాంచ్​ అవుతుంది. ఆ తర్వాత కొన్ని నెలలకు స్పార్క్​ 20సీ రిలీజ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. స్పార్క్​ 20 4జీ డిజైన్​, స్పెసిఫికేషన్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

టెక్నో స్పార్క్​ 20 4జీ..

పలు లీక్స్​ ప్రకారం.. టెక్నో స్పార్క్​ 20 4జీ డిజైన్​.. టెక్నో స్పార్క్​ 20సీ స్మార్ట్​ఫోన్​ని పోలి ఉంది. రేర్​లో ఐఫోన్​ తరహాలో కెమెరా ఐల్యాండ్​ ఉంటుంది. రెండు సెన్సార్​లు, ఒక ఫ్లాష్​లైట్​ వస్తున్నాయి. రేర్​లోనే టెక్నో స్పార్క్​ బ్రాండింగ్​ వస్తోంది. ఫ్రెంట్​లో పంచ్​ హోల్​ కటౌట్​ లభిస్తుంది. అందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్​కి ఫ్లాట్​- ఎడ్జ్​ డిజైన్​ వస్తోంది. రైట్​ సైడ్​లో పవర్​ బటన్​, వాల్యూమ్​ బటన్​లు ఉంటాయి.

Tecno Spark 20 price : లీక్స్​ ప్రకారం.. టెక్నో స్పార్క్​ 20 4జీలో మీడియాటెక్​ హీలియో జీ85 ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్స్​ ఇందులో ఉండొచ్చు!

ఈ టెక్నో కొత్త స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ డ్యూయెల్​ కెమెరా రేర్​లో ఉంటుందట. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 32ఎంపీ కెమెరా లభిస్తుందని సమాచారం. 500ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​ వంటివి కూడా ఇందుల వస్తాయట!

ధర ఎంత? లాంచ్​ ఎప్పుడు?

Tecno Spark 20c price in India : టెక్నో స్పార్క్​ 20 4జీ.. మూడు కలర్స్​లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అవి.. బ్లాక్​, స్కై బ్లూ, వైట్​. ఈ మోడల్​ లాంచ్​ డేట్​ ఇంకా ఫిక్స్​ అవ్వలేదు. కాగా.. 2023 డిసెంబర్​లోనే ఈ ఫోన్​ ఇండియాలో లాంచ్​ అవుతుందని రూమర్స్​ వినిపిస్తున్నాయి. ఇక ఈ గ్యాడ్జెట్​ ధరకు సంబంధించిన వివరాలపై కూడా క్లారిటీ లేదు. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం