తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Affordable Electric Car : ఈ మోస్ట్​ అఫార్డిబుల్​ ఫ్యామిలీ ఈవీపై మరింత డిస్కౌంట్​.. రేంజ్​ సూపర్​!

Affordable electric car : ఈ మోస్ట్​ అఫార్డిబుల్​ ఫ్యామిలీ ఈవీపై మరింత డిస్కౌంట్​.. రేంజ్​ సూపర్​!

Sharath Chitturi HT Telugu

19 October 2024, 12:26 IST

google News
    • Tata Tiago EV : తక్కువ ధరకే మంచి రేంజ్​ ఇచ్చే ఎలక్ట్రిక్​ కారును కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇదే రైట్​ టైమ్​! ఇండియాలో మోస్ట్​ అఫార్డిబుల్​ ఈవీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలపై సంస్థ డిస్కౌంట్స్​ని ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా టియాగో ఈవీ
టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఈవీ

ఇండియాలో మోస్ట్​ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ కార్లలో ఒకటిగా ఉంది టాటా టియాగో ఈవీ. ఇప్పుడు పండగ సీజన్​ నేపథ్యంలో, ఈ ఈవీపై టాటా సంస్థ భారీ డిస్కౌంట్​ని ప్రకటించింది. కస్టమర్లు ఈ ఈవీపై రూ. 75వేల వరకు బెనిఫిట్స్​ని పొందొచ్చు. అంతేకాదు టాటా పవర్​ స్టేషన్స్​లో 6 నెలల ఉచిత ఛార్జింగ్​ ప్రయోజనాలను కూడా ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ కారు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా టియాగో ఈవీ బ్యాటరీ ప్యాక్..

టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో లభిస్తుంది. ఇందులో 19.2 కిలోవాట్ల యూనిట్, 24 కిలోవాట్ల యూనిట్ ఉన్నాయి. రెండు యూనిట్లు లిక్విడ్-కూల్డ్, మల్టీ-మోడ్ రీజనరేటివ్​ బ్రేకింగ్ సిస్టెమ్​ని కలిగి ఉన్నాయి. 0 నో రెజిన్​తో పాటు 3 మ్యాక్స్​ రెజిన్ కలుపుకుని మొత్తం నాలుగు లెవల్స్ ఉన్నాయి. 

టాటా టియాగో ఈవి రేంజ్​ ఎంత?

టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్ వేరియంట్లు 221 కిలోమీటర్ల పరిధిని ఇస్తున్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లు 275 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్నాయి.

టాటా టియాగో ఈవీ కలర ఆప్షన్స్​?

టియాగో ఈవీ ఐదు రంగుల్లో లభిస్తుంది. సిగ్నేచర్ టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టీన్ వైట్, మిడ్​నైట్ ప్లమ్ ఉన్నాయి.

టాటా టియాగో ఈవీపై వారంటీ ఎంత?

టియాగో ఈవీలో బ్యాటరీ ప్యాక్, మోటార్ వారంటీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు. వాహనంపై 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ ఉంటుంది.

టియాగో ఈవీ యాక్సిలరేషన్ టైమ్​ ఎంత?

మీడియం రేంజ్ కలిగిన టియాగో ఈవీ.. 6.2 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టియాగో ఈవీ పవర్, టార్క్ గణాంకాలు ఏంటి?

ఎలక్ట్రిక్​ కారు మీడియం రేంజ్ వేరియంట్లు 60బీహెచ్​పీ పవర్, 110ఎన్ఎమ్ పవర్ అవుట్​పుట్​ని కలిగి ఉండగా, లాంగ్ రేంజ్ వేరియంట్లు 73బీహెచ్​పీ పవర్, 114ఎన్ఎమ్ పవర్ అవుట్​పుట్​ను జనరేట్​ చేస్తాయి.

టాటా టియాగో ఈవీపై బెనిఫిట్స్​ ఎప్పటివరకు ఉంటాయి?

టాటా టియాగో ఈవీపై ఆఫర్స్​, డిస్కౌంట్స్​తో పాటు ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలను పొందడానికి, ఆసక్తి గల కస్టమర్లు సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రయోజనాలు అక్టోబర్ 31తో ముగుస్తాయని గమనించాలి.

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో మంచి పోటీ నెలకొంది. ఫలితంగా ధరలు కూడా దిగొస్తున్నాయి. ఎంజీ కామెట్​ ఈవీకి టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తోంది. ఇక పండగ సీజన్​ నేపథ్యంలో ఇప్పటికే చౌకైన ఈవీగా ఉన్న ఈ మోడల్​.. మరింత తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం! ఫ్యామిలీలకు ఇది బాగా సూట్​ అవుతుంది.

తదుపరి వ్యాసం