Electric cars : మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కరెక్ట్‌గా సూట్ అయ్యే ఈవీలు ఇవే- ధర తక్కువ, రేంజ్ ఎక్కువ!
15 October 2024, 11:13 IST
- Budget electric cars in India : ఫ్యామిలీకి సరిపడా మంచి బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. తక్కువ ధర, ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈవీల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
టాటా టియాగో ఈవీ..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కి డిమాండ్‌తో పాటు పోటీ కూడా పెరుగుతోంది. అందుకే మునుపటి కన్నా ఇప్పుడు చాలా తక్కువ ధరకే మంచి రేంజ్ ఇచ్చే ఈవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2024 అక్టోబర్ ఇండియాలో టాప్-4 బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
బడ్జెట్ ఫ్రెండ్లీ- బెస్ట్ ఈవీలు..
ఎంజీ కామెట్ ఈవీ- ఇందులో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ 42 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. 7.4 కేడబ్ల్యూ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జింగ్‌కి 3.5 గంటల సమయం పడుతుంది. పైగా ఎంజీ కామెట్ ఈవీ సైజు చిన్నగా ఉండటంతో, నగరాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలు తగ్గుతాయి. ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 6.99లక్షల నుంచి రూ. 9.53లక్షల వరకు ఉంటుంది.
టాటా టియాగో ఈవీ- టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఈ టియాగో ఈవీ ఒకటి. ఇదొక ఎంట్రీ లెవల్ ఈవీ. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్. వీటి రేంజ్ వరుసగా 250కి.మీ, 315కి.మీ. 7.2 కేడబ్ల్యూహెచ్ ఛార్జర్‌తో మొదటి బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేసేందుకు 2.6 గంటల సమయం మాత్రమే పడుతుంది! రెండో బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 3.6 గంటల సమయం పడుతుంది. టాటా టియాగో ఈవీ ఎక్స్‌షోరూం ధరలు రూ. 7.99లక్షలు- రూ. 11.89లక్షల మధ్యలో ఉంటాయి.
టాటా పంచ్ ఈవీ- టాటా మోటార్స్ నుంచి మరో సరసమైన, బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్.. ఈ టాటా పంచ్ ఈవీ. ఇందులో 25 కేడబ్ల్యూహెచ్, 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. 7.2 కేడబ్ల్యూ ఛార్జర్‌తో వీటిని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 3.6 గంటలు, 5 గంటల సమయం పడుతుంది. టాటా పంచ్ ఈవీ రెంజ్ వరుసగా 315 కి.మీ, 421 కి.మీ. టాటా పంచ్ ఈవీ ఎక్స్‌షోరూం ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.
సిట్రోయెన్ ఈసీ3 ఈవీ- సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి నుంచి వచ్చి తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ ఈసీ3. ఇది టాటా పంచ్ ఈవీకి పోటి! ఇందులో 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 57 పీఎస్ పవర్, 143 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసేందుకు కేవలం 57 నిమిషాల సమయమే పడుతుంది. దీని రేంజ్ 320 కి.మీ.