BYD eMax 7 Electric Car : భారత మార్కెట్‌లోకి బీవైడీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు-byd emax 7 electric car launched with 530 km range 71 8kwh battery know price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Emax 7 Electric Car : భారత మార్కెట్‌లోకి బీవైడీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు

BYD eMax 7 Electric Car : భారత మార్కెట్‌లోకి బీవైడీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు

Anand Sai HT Telugu

BYD Electric Car : చైనీస్ కంపెనీ బీవైడీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు ఇమ్యాక్స్ 7ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బీవైడీ ఇమ్యాక్స్ 7 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్‌ ఇస్తుంది.

బీవైడీ ఇమ్యాక్స్ 7 లాంచ్

చైనీస్ కంపెనీ బీవైడీ కొత్త ఎలక్ట్రిక్ కారు ఇమ్యాక్స్ 7ను ఇండియాలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ .26.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. బీవైడీ ఇమ్యాక్స్ 7 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే, ఇది రెండు వేరియంట్లలో కూడా లభిస్తుంది. మునుపటి ఇ6 ఎమ్‌పీవీ స్థానంలో ఇమ్యాక్స్ 7 వస్తుంది. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేశారు. దీనికి పలు కొత్త ఫీచర్లను కూడా జోడించారు. ఇప్పటికే ఇమ్యాక్స్ 7 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.51,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల రేంజ్ ఈ ఎలక్ట్రిక్ కారు సొంతం. ఇమ్యాక్స్ 7 సుపీరియర్, ప్రీమియం వంటి రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇది 71.8 కిలోవాట్లు, 55.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందుతుంది. 71.8 కిలోవాట్ల మోడల్ 530 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో 55.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ చేస్తే 420 కిలోమీటర్ల పరిధిని పొందుతుందని కంపెనీ పేర్కొంది.

మరోవైపు సుపీరియర్ వెర్షన్ కేవలం 8.6 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రీమియం వేరియంట్లు 10.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు.

లగ్జరీ ఇంటీరియర్, స్ట్రాంగ్ సేఫ్టీ కూడా ఈ కార్లలో ఉంది. ఇమ్యాక్స్ 7 ఇంటీరియర్, ఇందులో లభ్యమయ్యే ఫీచర్ల గురించి చూస్తే.. ఇ6తో పోలిస్తే 3 వరుసల సీటింగ్ ఉంటుంది. మీరు దీన్ని 6-సీట్లు, 7-సీట్ల కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయగలరు. కొత్త ఇమ్యాక్స్ 7 యొక్క టాప్-స్పెక్ వెర్షన్ అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్ లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్, 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

బీవైడీ ఇమ్యాక్స్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు

బీవైడీ ఇమ్యాక్స్ 7 ప్రీమియం 6 సీటర్ – రూ. 26.90 లక్షలు

బీవైడీ ఇమ్యాక్స్ 7 ప్రీమియం 7 సీటర్ – రూ. 27.50 లక్షలు

బీవైడీ ఇమ్యాక్స్ 7 సుపీరియర్ 6 సీటర్ – రూ. 29.30 లక్షలు

బీవైడీ ఇమ్యాక్స్ 7 సుపీరియర్ 7 సీటర్ – రూ. 29.90 లక్షలు