Free petrol : ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్ ఇస్తున్నారు.. ఇది తెలుసుకుంటే మీ డబ్బు ఆదా!
Fuel credit card : మీ బండికి తరచూ పెట్రోల్, డీజిల్ కొట్టిస్తుంటారా? మీ ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు గురించి తెలసుకోవాలి.
మీరు రోజు బైక్ లేదా కారులో ప్రయాణిస్తుంటారా? వెహికిల్స్‌కి తరచుగా పెట్రోల్, డీజిల్ కొట్టిస్తుంటారా? మరి బిల్లు ఆదా చేసుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే! మీ ఖర్చులు తగ్గించుకునే విధంగా వార్షికంగా 50 లీటర్ల వరకు ఇంధనాన్ని ఉచితంగా పొందొచ్చు. దీని కోసం మీరు ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు గురించి తెలసుకోవాలి. పూర్తి వివరాలు..
ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు..
కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు, వారి క్రెడిట్ కార్డు స్పెండింగ్ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగానే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ క్రెడిట్ కార్డులతో కస్టమర్స్‌కి మంచి బెనిఫిట్స్ ఇస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి.. ఈ ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు. దీని ద్వారా వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్ లేదా డీజిల్‌ని ఫ్రీగా పొందొచ్చు.
ఈ క్రెడిట్ కార్డు ఫీచర్స్ ఇవే-
- వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ ఫ్రీ!
- ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఇంధన కొట్టించి 5శాతం వరకు ఫ్యూయెల్ పాయింట్స్ పొందొచ్చు. (మొదటి 6 నెలల వరకు ప్రతి నెల గరిష్ఠంగా 250 ఫ్యూయెల్ పాయింట్స్, ఆ తర్వాతి 6 నెలల వరకు 1150 ఫ్యూయెల్ పాయింట్స్.)
- గ్రాసరీ, బిల్ పేమెంట్స్‌పైనా ప్రతి నెల 100 ఫ్యూయెల్ పాయింట్స్ వరకు పొందొచ్చు.
- రూ. 150 వరకు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్తో పాటు ఇతర లావాదేవీలపై 1 ఫ్యూయెల్ పాయింట్ పొందొచ్చు.
అదనపు ఫీచర్స్-
- IndianOil XTRAREWARDSTM Program (IXRP) membership ని కాంప్లిమెంటరీగా లభిస్తుంది.
- రివాల్వింగ్ క్రెడిట్, జీరో లాస్ట్ కార్డ్ లయబిలిటీ, ఇంటరెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ వంటి వాటిని పొందొచ్చు.
- సర్ఛార్జ్ తొలగింపు- కనిష్ఠంగా రూ. 400 ఇంధన బిల్లుపై 1శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జ్‌ని రద్దు చేసుకోవచ్చు.
ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్- వాలిడిటీ, ఇతర వివరాలు..
ఈ ఫ్యూయెల్ పాయింట్స్ వాలిడిటీ గరిష్ఠంగా 2ఏళ్లు.
ఐఓసీఎల్ ఔట్లెట్స్ వద్ద ఈ ఫ్యూయెల్ పాయింట్స్‌ని రిడీమ్ చేసుకోవచ్చు. 1 ఫ్యుయెల్ పాయింట్ అంటే రూ. 96 పైసలు.
లేదా నెట్‌బ్యాంకింగ్, క్యాష్‌బ్యాక్ రూపంలో కూడా రిడీమ్ చేసుకోవచ్చు. కానీ వీటి వాల్యూ వేరువేరుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఎలిజిబిలిటీ..
సాలరీ పొందుతున్న భారతీయులకు- వయస్సు 21 నుంచి 60ఏళ్ల మధ్యలో ఉండాలి. నెలవారీ జీతం రూ. 12వేలు కన్నా ఎక్కువ ఉండాలి.
వ్యాపారులకు- వయస్సు 21 నుంచి 65 మధ్యలో ఉండాలి. వార్షిక ఆదాయం 6 లక్షల కన్నా ఎక్కువగా ఉండాలి.
ఫీజు- ఇతర ఛార్జీలు..
జాయినింగ్/ రెన్యువల్ మెంబర్షిప్ ఫీజు- రూ. 500 ప్లస్ ట్యాక్స్.
ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం