తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev : టాటా పంచ్​ ఈవీ డెలివరీ షురూ- ఆన్​రోడ్​ ప్రైజ్​ చెక్​ చేశారా?

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ డెలివరీ షురూ- ఆన్​రోడ్​ ప్రైజ్​ చెక్​ చేశారా?

Sharath Chitturi HT Telugu

22 January 2024, 15:45 IST

    • Tata Punch EV : టాటా పంచ్​ ఈవీపై కీలక అప్డేట్​. ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ డెలివరీలను ప్రారంభించింది టాటా మోటార్స్​.
టాటా పంచ్​ ఈవీ డెలివరీ షురూ- ఆన్​రోడ్​ ప్రైజ్​ చెక్​ చేశారా?
టాటా పంచ్​ ఈవీ డెలివరీ షురూ- ఆన్​రోడ్​ ప్రైజ్​ చెక్​ చేశారా?

టాటా పంచ్​ ఈవీ డెలివరీ షురూ- ఆన్​రోడ్​ ప్రైజ్​ చెక్​ చేశారా?

Tata Punch EV deliveries : టాటా పంచ్​ ఈవీని టాటా మోటార్స్​ సంస్థ ఇటీవలే లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ డెలివరీలను ప్రారంభించింది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఓసారి చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

టాటా పంచ్​ ఈవీ వివరాలు..

టాటా పంచ్​ ఈవీ ఇంట్రొడక్టరీ ధర రూ. 10.99లక్షలు- రూ. 14.49లక్షల మధ్యలో ఉంది. ఫిబ్రవరి 1, 2024 వరకు ఈ ధర కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత.. టాటా పంచ్​ ఈవీ ధర పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నుంచి తమ పోర్ట్​ఫోలియోలోని ఐసీఈ, ఎలక్ట్రిక్​ వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించడం ఇందుకు కారణం.

ఇక.. టాటా పంచ్​ ఈవీ ​లో స్టాండర్డ్​, లాంగ్​ రేంజ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 5 వేరియంట్లు ఉంటాయి. అవి.. స్మార్ట్​, స్మార్ట్​+ , అడ్వెంచర్​, ఎంపవర్డ్​, ఎంపవర్డ్​+. స్మార్ట్​, స్మార్ట్​+ వేరియంట్లలో స్టాండర్డ్​ ఆప్షన్​ మాత్రమే ఉంటుంది. మిగితా మూడింట్లో స్టాండర్డ్​తో పాటు లాంగ్​ రేంజ్​ ఆప్షన్​ కూడ ఉంటుంది.

Tata Punch EV price in Hyderabad : టాటా పంచ్​ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. అవి 25కేడబ్ల్యూహెచ్​, 35కేడబ్ల్యూహెచ్​. వీటిన ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. వరుగా 315 కి.మీలు, 421 కి.మీల దూరం ప్రయాణిస్తాయని సంస్థ చెబుతోంది.

టాటా పంచ్​ ఈవీ స్టైలింగ్​.. ఐసీఈ ఇంజిన్​ వర్షెన్​తో పోలి ఉంటుంది. టాప్​ ఎండ్​ మోడల్​లో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​, వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, వయర్​లెస్​ ఛార్జర్​, ఎయిర్​ ప్యూరిఫైయర్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, ఆటో డిమ్మింగ్​ ఐఆర్​వీఎంలు లభిస్తున్నాయి.

హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

టాటా పంచ్​ ఈవీ స్మార్ట్​ 3.3- రూ. 13.20 లక్షలు.

పంచ్​ ఈవీ స్మార్ట్​ ప్లస్​ 3.3- రూ. 13.80 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ 3.3- రూ. 14.39 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ ఎస్​ 3.3- రూ. 14.98 లక్షలు.

Tata Punch EV on road price in Hyderabad : పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ 3.3- 15.34 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ లాంగ్​ రేంజ్​ 3.3- రూ. 15.64 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ఎస్​ 3.3- రూ. 15.93 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ 3.3- రూ. 15.93 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ లాంగ్​ రేంజ్ ఫాస్ట్​ ఛార్జర్​- రూ. 16.23 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్ ఎస్​​ లాం​గ్​ రేంజ్​ 3.3- రూ. 16.23 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ ఎస్​ 3.3- రూ. 16.52 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ లాంగ్​ రేంజ్​ 3.3- రూ. 16.83 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ ఎస్​ లాంగ్​ రేంజ్​ ఫాస్ట్​ ఛార్జర్-​ రూ. 16.83 లక్షలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం