Tata Punch facelift : బెస్ట్​ సెల్లింగ్​ ‘టాటా పంచ్​’ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..!-tata punch facelift to launch in 2025 see what to expect ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Facelift : బెస్ట్​ సెల్లింగ్​ ‘టాటా పంచ్​’ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..!

Tata Punch facelift : బెస్ట్​ సెల్లింగ్​ ‘టాటా పంచ్​’ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Jan 19, 2024 01:16 PM IST

Tata Punch facelift : టాటా మోటార్స్​కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్​! టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని సంస్థ సిద్ధం చేస్తోందట. ఆ వివరాలు..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..!
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..!

Tata Punch facelift launch date : కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్స్​తో పాటు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ల లాంచ్​తో బిజీబిజీగా ఉన్న టాటా మోటార్స్​కు సంబంధించిన మరో క్రేజీ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. టాటా పంచ్​ ఎస్​యూవీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సిద్ధం చేస్తోందట! 2025లో ఈ వెహికిల్​ లాంచ్​ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. ఈ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​పై ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ ఎప్పుడు?

తన పోర్ట్​ఫోలియోలోని వెహికిల్స్​ని 3ఏళ్లకోసారి అప్డేట్​ చేస్తూ ఉంటుంది టాటా మోటార్స్​. ఇందులో భాగంగానే.. టాటా నెక్సాన్​, నెక్సాన్​ ఈవీ, హారియర్​, సఫారీ ఎస్​యూవీలకు 2023లో ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​ వచ్చాయి. ఇక 2021లో లాంచ్​ అయిన టాటా పంచ్​కు 2024లో అప్డేటెడ్​ వర్షెన్​ రావాల్సి ఉంది. అయితే.. ఈ మోడల్​.. 2025 రెండో భాగంలో మార్కెట్​లోకి అడుగుపెడుతుందని టాక్​ నడుస్తోంది.

Tata Punch facelift launch date in India : టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటి ఈ టాటా పంచ్​. ఇటీవలే 3 లక్షల సేల్స్​ మైలురాయిని కూడా తాకింది. ఈ మోడల్​లో సీఎన్​జీ వేరియంట్​ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఈవీని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. దీని డిజైన్​కి కార్​ లవర్స్​ ఫిదా అవుతున్నారు.

ఇక టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో స్లీక్​ డీఆర్​ఎల్స్​, కొత్త గ్రిల్​- బంపర్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​ వంటివి వస్తాయని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో.. తమ పోర్ట్​ఫోలియోలోని వెహికిల్స్​కి కనెక్టెడ్​ ఎల్​ఈడీ బార్స్​ని ఇస్తోంది టాటా మోటార్స్​. టాటా పంచ్​ ఎస్​యూవీకి కూడా ఈ అప్డేట్​ లభించే అవకాశం ఉంది.

కాగా.. ఇంజిన్​ పరంగా పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్​, రెవట్రాన్​, 3 సిలిండర్​ ఇంజిన్​ కొనసాగే అవకాశం ఉంది. ఈ ఎస్​యూవీలో.. 5 స్పీడ్​ మేన్యువల్​, ఏఎంటీ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ ధర ఎంత ఉండొచ్చు..?

Tata Punch facelift price : ప్రస్తుత.. టాటా పంచ్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉంది. టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర.. దీని కన్నా కాస్త ఎక్కువే ఉండొచ్చు.

టాటా పంచ్​ ఈవీ దుమ్మురేపుతుందని సంస్థ భావిస్తోంది. టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ కూడా అంచనాలకు మించిన ప్రదర్శన చేస్తుందని ఆశిస్తోంది.

ఈ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ ఇతర ఫీచర్స్​ వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం