తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్​ వర్సెస్ కియా​ సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​- ఏది బెస్ట్​?

Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్​ వర్సెస్ కియా​ సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

18 September 2023, 12:25 IST

google News
    • 2023 Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్​ వర్సెస్​ కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​.. ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..
2023 టాటా నెక్సాన్​ వర్సెస్ కియా​ సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​- ఏది బెస్ట్​?
2023 టాటా నెక్సాన్​ వర్సెస్ కియా​ సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​- ఏది బెస్ట్​?

2023 టాటా నెక్సాన్​ వర్సెస్ కియా​ సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​- ఏది బెస్ట్​?

2023 Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్​ను ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. ఈ ఫేస్​లిఫ్ట్ వర్షెన్​​.. 2023 కియా సెల్టోస్​తో ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు ఎస్​యూవీ డీజైన్​, లుక్స్​ ఇవే..

టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​లో బంపర్​ మౌంటెడ్​ ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్ప్లిట్​ టైప్​ సీక్వెన్షియల్​ డీఆర్​ఎల్స్​, అడాప్టివ్​ ఎల్​ఈడీ ఫాగ్​ ల్యాంప్స్​, స్కిడ్​ ప్లేట్స్​, స్లీక్​ రూఫ్​ రెయిల్స్​, కనెక్టెడ్​ టైప్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, మోటిఫ్​, 16 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ వీల్స్​ వస్తున్నాయి.

కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​లో టైగర్​ నోస్​ గ్రిల్​, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​తో కూడిన స్లీక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, బంపర్​ మౌంటెడ్​ ఫాగ్​ ల్యాంప్స్​, ఆటో- ఫోల్డింగ్​ ఓఆర్​వీఎంలు, కనెక్టెడ్​ టైప్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి.

ఈ రెండు ఎస్​యూవీల ఫీచర్స్​ ఇవే..

Tata Nexon facelift price : టాటా నెక్సాన్​ స్పెషియస్​ సీటర్​ కేబిన్​లో ఇండిగో కలర్​ లెథరేట్​ అప్​హోలిస్ట్రీ, వాయిస్​ అసిస్టెడ్​ సన్​రూఫ్​, వయర్​లెస్​ ఛార్జర్​, బాక్​లిట్​ టచ్​ ఏసీ కంట్రోల్స్​, 2 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, లోగో, 6 ఎయిర్​బ్యాగ్స్​ లభిస్తున్నాయి.

ఇక కియా బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​లో లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, వాయిస్​ కంట్రోల్డ్​ పానారోమిక్​ సన్​రూఫ్​, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, బాస్​ సౌండ్​ సిస్టెమ్​, డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్​, లెవల్​ 2 ఏడీఏఎస్​ సెటప్​ ఉంటాయి.

ఇదీ చూడండి:- Tata Nexon EV vs Mahindra XUV400 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

ఈ రెండు ఎస్​యూవీల్లో ఉండే ఇంజిన్​ వివరాలు..

2023 టాటా నెక్సాన్​లో 1.5 లీటర్​ టర్బో డీజిల్​ మోటార్​ ఉంటుంది. ఇది 113 హెచ్​పీ పవర్​ను, 260 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 118 హెచ్​పీ పవర్​ను, 170 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

2023 Kia Seltos price Hyderabad : మరోవైపు కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​లో 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 113.4 హెచ్​పీ పవర్​ను, 144 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.5 లీటర్​ డీజిల్​ మోటార్​.. 113.4 హెచ్​పీ పవర్​ను, 250ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కొత్త 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 160 హెచ్​పీ పవర్​ను, 253 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఐఎంటీ, 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ, డీసీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

ఈ రెండు వాహనాల ధరలు ఎంతంటే..

Tata Nexon on road price Hyderabad : ఇండియాలో టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.1లక్షలు- రూ. 13లక్షల మధ్యలో ఉంటుంది. ఇక 2023 కియా సెల్టోస్​ ఎక్స్​షోరూం ధర రూ. 10.9లక్షలు రూ. 20లక్షల మధ్యలో ఉంటుంది.

తదుపరి వ్యాసం