Tata Motors share price : తొలిసారి రూ. 1000 మార్క్‌ని దాటిన టాటా మోటార్స్.. ఒకే రోజు 8శాతం అప్!
05 March 2024, 11:21 IST
- Tata Motors demerger : సంస్థలోని కీలక విభాగాల డీమర్జర్ ప్లాన్‌ని టాటా మోటార్స్ ప్రకటించడంతో.. స్టాక్ నూతన గరిష్ఠాన్ని తాకింది. తొలిసారిగా.. టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ 1000 మార్క్‌ని దాటింది!
డీమర్జర్ ప్లాన్‌తో భారీగా పెరిగిన టాటా మోటార్స్ షేర్ ప్రైజ్..
Tata Motors demerger impact : డీమర్జర్ ప్లాన్‌తో.. టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ దూసుకెళుతోంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఈ టాటా మోటార్స్ స్టాక్.. తొలిసారిగా రూ. 1000 మార్క్‌ని తాకింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో 8శాతం పెరిగి రూ. 1,065 వరకు వెళ్లిన స్టాక్.. 11 గంటల సమయంలో రూ. 1,030 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్‌లో ఇంతటి ర్యాలీకి కారణం.. టాటా మోటార్స్ డీమర్జర్!
టాటా మోటార్స్ డీమర్జర్..
సంస్థకు చెందిన కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్‌ని, ప్యాసింజర్ వెహికిల్స్ సెగ్మెంట్(ఈవీ, జేఎల్ఆర్తో కలిపి)ని వేరు చేస్తున్నట్టు, ఇందుకు టాటా మోటమార్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ఆమోద ముద్రవేసినట్టు.. సోమవారం సాయంత్రం ఓ ప్రకటన చేసింది సంస్థ. టాటా మాటర్స్ డీమర్జర్ అయితే.. స్టాక్‌లో వాల్యూ క్రియేషన్ అవకాశాలు పెరుగుతాయని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే.. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ దాదాపు 8శాతం పెరిగింది. అక్కడి నుంచి కాస్త కూల్ఆఫ్ అయ్యింది.
Tata Motors demerger share price : టాటా మోటార్స్ సీవీ విభాగం, పీవీ విభాగాల వాల్యూమ్‌లు, ప్రదర్శన, మార్జిన్స్, డ్రైవర్స్, కంపిటీటీర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. ఇక డీమర్జర్ ప్లాన్‌తో టాటా మోటార్స్ స్మార్ట్ మూవ్ వేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోటీ విషయంలో.. ప్యాసింజర్ వెహికిల్స్ సెగ్మెంట్.. మార్కెట్ లీడర్ అయిన మారుతీ సుజుకీకి ఇప్పుడు డైరక్ట్‌గా పోటీనిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జేఎల్ఆర్తో వాల్యూయేషన్ గ్యాప్ కూడా పూడ్చుకోవచ్చని అంటున్నారు.
ఇండియాలో ప్యాసింజర్ వెహికిల్స్ సెగ్మెంట్‌కి బీభత్సమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో.. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న ఎం అండ్ ఎం కూడా మంచి పోటీనిస్తోంది. ఈ తరుణంలో.. టాటా మాటర్స్ తన డీమర్జర్ ప్లాన్‌ని ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది.
Tata Motors demerger impact on share price : తాజా మూవ్‌తో.. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్లో అశోక్ లేల్యాండ్‌కు టాటా మోటార్స్ ఇంకా గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ షేర్ ప్రైజ్..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్స్ స్టాక్ దుమ్మురేపింది. వాస్తవానికి ఏడాది కాలంగా ఈ స్టాక్ దూసుకెళుతూనే ఉంది. ఐదు రోజుల్లో 5.5శాతం పెరిగిన టాటా మోటార్స్ షేర్ ప్రైజ్.. నెల రోజుల్లో 11శాతం వృద్ధిని సాధించింది. ఆరు నెలల్లో ఏకంగా 68శాతం, ఏడాదిలో 30.15శాతం పెరిగింది.
Tata Motors share price target : కానీ.. కరోనా సమయంలో పడిన లో (రూ. 79.6) నుంచి చూసుకుంటే.. టాటా మోటార్స్ స్టాక్.. 1193శాతం వృద్ధిని సాధించినట్టు!