Tata Motors demerger : టాటా మోటార్స్​ షేర్​హోల్డర్స్​కి అలర్ట్​- రెండుగా విడిపోనున్న సంస్థ!-tata motors to demerge businesses into two separate listed entities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Demerger : టాటా మోటార్స్​ షేర్​హోల్డర్స్​కి అలర్ట్​- రెండుగా విడిపోనున్న సంస్థ!

Tata Motors demerger : టాటా మోటార్స్​ షేర్​హోల్డర్స్​కి అలర్ట్​- రెండుగా విడిపోనున్న సంస్థ!

Sharath Chitturi HT Telugu
Mar 04, 2024 05:13 PM IST

Tata Motors latest news : టాటా మోటార్స్​ షేర్​హోల్డర్స్​కి ముఖ్యమైన అప్డేట్​! టాటా మోటార్స్​ సంస్థ.. రెండుగా విడిపోనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

రెండు వేరువేరు కంపెనీలుగా విడిపోనున్న టాటా మోటార్స్​!
రెండు వేరువేరు కంపెనీలుగా విడిపోనున్న టాటా మోటార్స్​! (Bloomberg)

Tata Motors demerger news : టాటా మోటార్స్​ లిమిటెడ్​ డీమర్జర్​కి బోర్డ్​ ఆఫ్​ డైరక్టర్స్​ అమోదించినట్టు.. సోమవారం ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఫలితంగా.. రెండు వేరువేరు లిస్టెడ్​ కంపెనీలుగా టాటా మోటార్స్​ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని టాటా మోటార్స్​ షేర్​హోల్డర్లు కచ్చితంగా తెలుసుకోవాలి.

టాటా మోటార్స్​ డీమర్జర్​..

డీమర్జర్​ తర్వాత.. ఒక కంపెనీలో టాటా మోటార్స్​కి చెందిన కమర్షియల్​ వెహికిల్స్​ బిజినెస్​, దానికి సంబంధించిన ఇన్​వెస్ట్​మెంట్స్​ ఉంటాయి. ఇంకో కంపెనీలో ప్యాసింజర్​ వెహికిల్స్​ (పీవీ, ఈవీ, జేఎల్​ఆర్​) బిజినెస్​, దానికి సంబంధించిన ఇన్​వెస్ట్​మెంట్స్​ ఉంటాయి. టాటా మోటార్స్​ డీమర్జర్​ని "ఎన్​సీఎల్​టీ స్కీమ్ ఆఫ్​ అరేంజ్​మెంట్​"​ ద్వారా పూర్తి చేస్తామని సంస్థ చెప్పింది. కాగా.. టాటా మోటార్స్​ షేర్లు కలిగి ఉన్న షేర్​హోల్డర్లకు రెండు కంపెనీల్లోనూ సమానమైన వాల్యూ ఉంటుందని స్పష్టం చేసింది.

గత కొంతకాలంగా.. టాటా మోటార్స్​ కమర్షియల్​ వెహికిల్స్​, ప్యాసింజర్​ వెహికిల్స్​, ఎలక్ట్రిక్​ వెహికిల్స్​, జాగ్యువర్​ ల్యాండ్​ లోవర్​ విభాగాలు బలంగా రాణిస్తున్నాయి. ఇందుకు ఆ సంస్థ అమలు చేసిన వివిధ స్ట్రాటజీలు కారణం. 2021 నుంచి.. ఈ విభాగాలన్నీ వేరువేరుగా పనిచేస్తున్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో సీఈఓ ఉండటం విశేషం.

Tata Motors latest news : "గత కొన్నేళ్లల్లో టాటా మోటార్స్​ బాగా వృద్ధిచెందింది. అంతేకాకుండా.. మూడు విభాగాలు ఇండిపెండెంట్​గా పనిచేస్తున్నాయి. ఇక టాటా మోటార్స్​ డీమర్జర్​తో మార్కెట్​ అవకాశాలు మరింత అందిపుచ్చుకోవచ్చు. ఒక్కో విభాగంపై మరింత శ్రద్ధ పెట్టొచ్చు. ఫలితంగా.. మా కస్టమర్లకు సుపీరియర్​ ఎక్స్​పీరియెన్స్​ అందించగలుగుతాము. ఉద్యోగులకు కూడా గ్రోత్​ ప్రాస్పెక్ట్​ మెరుగ్గా ఉంటుంది. షేర్​హోల్డర్స్​కి వాల్యూ క్రియేట్​ అవుతుంది," అని టాటా మోటార్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ అన్నారు.

2022లో టాటా మోటార్స్​ పీవీ, ఈవీ సెగ్మెంట్​ సబ్సిడరైజేషన్​ జరిగింది. అప్పటి నుంచి సంస్థ మరింత బలంగా ఎదిగింది. ఇక టాటా మోటార్స్​ డీమర్జర్​తో ఒక్కో విభాగం స్వచ్ఛందంగా పనిచేయడానికి వీలుంటుంది. ఒక్కో విభాగం.. ఒక్కో స్ట్రాటజీని అప్లై చేసి ఎదిగే అవకాశం లభిస్తుంది.

రానున్న నెలల్లో.. ఎన్​సీఎల్​టీ స్కీమ్​ ఆఫ్​ అరేంజ్​మెంట్​ని టాటా మోటార్స్​ లిమిటెడ్​ బోర్డ్​ ఆఫ్​ డైరక్టర్స్​ ముందు పెడతారు. వారు ఆమోదించిన తర్వాత.. షేర్​హోల్డర్లు, క్రెడిటర్లు ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం రెగ్యులేటరీ కూడా ఒప్పుకోవాలి. దీనికి 12 నుంచి 15 నెలల పాటు సమయం పట్టొచ్చు.

డీమర్జర్​తో సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, ఇతర వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రభావం చూపించదు.

టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​..

Tata Motors share price : సంస్థతో పాటు టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ కూడా వృద్ధిచెందుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ 989 వద్ద క్లోజ్​ అయ్యింది. ఐదు రోజుల్లో ఈ స్టాక్​ 5శాతం పెరిగింది. నెల రోజుల్లో 6శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా.. గత ఆరు నెలల్లో ఈ టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ ఏకంగా 61.8శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

సంబంధిత కథనం