Discounts on Tata Motors cars : ఈ టాటా మోటార్స్ కార్లపై రూ. 1.25లక్షల వరకు డిస్కౌంట్!
08 December 2023, 8:50 IST
- Discounts on Tata Motors cars : టాటా మోటార్స్ సంస్థ.. తన పోర్ట్‌ఫోలియోలోని వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాలు..
ఈ టాటా మోటార్స్ కార్లపై రూ. 1.25లక్షల వరకు డిస్కౌంట్!
Discounts on Tata Motors cars : ఇతర ఆటోమొబైల్ సంస్థల్లానే.. టాటా మోటార్స్ సైతం తమ వాహనాలపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను ప్రకటించింది. డిసెంబర్లో పలు వాహనాలపై రూ. 1.25లక్షల వరకు బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు..
టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్‌పై రూ. 20వేల వరకు కన్జ్యూమర్ డిస్కౌంట్, రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని ఇస్తోంది. ఇక ఆల్ట్రోజ్ సీఎన్జీ మోడల్‌పై రూ. 10వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఆల్ట్రోజ్ పెట్రోల్ ఎంటీపై రూ. 40వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.
Discounts on Tata Harrier : టాటా హారియర్ ఎంటీ-ఏటీ (నాన్ అడాస్) మోడల్స్ప రూ. 50వేల కన్జ్యూమర్ డిస్కౌంట్, రూ. 25వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని ఇస్తోంది సంస్థ. మరోవైపు టాటా హారియర్ ఏటీ అడాస్ వేరియంట్‌పై రూ. 75వేల కన్జ్యూమర్ డిస్కౌంట్, రూ. 50వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఈ మొత్తం కలుపుకుంటే.. ఈ డిసెంబర్లో టాటా హారియర్‌పై రూ. 1.25లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు!
టాటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న వాహనాల్లో టాటా పంచ్ ఒకటి. ఇంతకాలం.. ఈ మోడల్‌పై ఎలాంటి తగ్గింపును ఇవ్వలేదు సంస్థ. కాగా.. తొలిసారిగా ఈ డిసెంబర్లో టాటా పంచ్‌పై రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ని ప్రకటించింది.
Year end discounts on Tata cars : మరోవైపు టాటా టియాగో సీఎన్జీ, టాటా టిగోర్ సీఎన్జీ సింగిల్ సిలిండర్ వేరియంట్‌పై రూ. 60వేల కన్జ్యూమర్ డిస్కౌంట్‌తో పాటు రూ. 15వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని ఇస్తోంది సంస్థ. టియాగో ఎంటీ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 55వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఏఎంటీ, సీఎన్జీ ట్విన్ సిలిండర్ మోడల్స్‌పై గరిష్ఠంగా రూ. 45వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అదే సమయంలో టాటా టిగోర్‌పై రూ. 40వేల డిస్కౌంట్‌తో పాటు రూ. 15వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.
ఇవి.. ఈ నెల చివరి వరకు అమల్లో ఉంటాయి. కాగా.. ఈ డిస్కౌంట్లనేవి లొకేషన్‌పై ఆధారపడి ఉంటాయి. పూర్తి వివరాల కోసం సమీప డీలర్షిప్ షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇప్పుడు డిస్కౌంట్లు.. 2024 నుంచి బాదుడు!
Tata motors price hike : టాటా మోటార్స్ సంస్థ.. కస్టమర్లకు మళ్లీ షాక్ ఇచ్చింది. తమ పోర్ట్‌ఫోలియోలోని వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రైజ్ హైక్ నిర్ణయం.. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఏ వాహనం ధరను ఎంత పెంచుతున్నాము? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.