Tata Motors price hike : కస్టమర్లకు టాటా మోటార్స్​ బిగ్​ షాక్​.. మళ్లీ భారీగా ధరల పెంపు!-tata motors to raise car prices in india in january 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Price Hike : కస్టమర్లకు టాటా మోటార్స్​ బిగ్​ షాక్​.. మళ్లీ భారీగా ధరల పెంపు!

Tata Motors price hike : కస్టమర్లకు టాటా మోటార్స్​ బిగ్​ షాక్​.. మళ్లీ భారీగా ధరల పెంపు!

Sharath Chitturi HT Telugu
Nov 28, 2023 06:05 AM IST

Tata Motors price hike : తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ సంస్థ ప్రకటించింది. 2024 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

కస్టమర్లకు టాటా మోటార్స్​ బిగ్​ షాక్​.. మళ్లీ భారీగా ధరల పెంపు!
కస్టమర్లకు టాటా మోటార్స్​ బిగ్​ షాక్​.. మళ్లీ భారీగా ధరల పెంపు! (REUTERS)

Tata Motors price hike : టాటా మోటార్స్​ సంస్థ.. కస్టమర్లకు మళ్లీ షాక్​ ఇచ్చింది. తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రైజ్​ హైక్​ నిర్ణయం.. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఏ వాహనం ధరను ఎంత పెంచుతున్నాము? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది.

హ్యాచ్​బ్యాక్​ నుంచి ఎస్​యూవీల వరకు టాటా మోటార్స్​ పోర్ట్​ఫోలియోలో అనేక వెహికిల్స్​ ఉన్నాయి. ఇక దేశీయ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో ఈ సంస్థ ఈవీలకు క్రేజీ డిమాండ్​ ఉంది. వీటన్నిటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

"2024 జనవరిలో మా వాహనాల ధరలను పెంచాలని చూస్తున్నాము. ఎంత పెంచుతున్నాము అనేది త్వరలోనే వెల్లడిస్తాము," అని సోమవారం ప్రకటించింది టాటా మోటార్స్​.

ఈ నిర్ణయంతో కస్టమర్లపై మరింత భారం పడనుంది.

మారుతీ సుజుకీ కూడా..!

మరో దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు.. 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా.. ధరల పెంపునకు ఎప్పుడు చెప్పే కారణాలే ఈసారి కూడా చెప్పింది. ప్రొడక్షన్​ కాస్ట పెరుగుతోందని, అందుకే వాహనాలపై ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది. అయితే.. ఏ వాహనాలపై ఎంత రేట్​ హైక్​ ఉంటుందనే విషయాన్ని సంస్థ ఇంకా చెప్పలేదు.

Maruti Suzuki price hike : "ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో కాస్ట్​ ప్రెజర్​ పడుతోంది. అందుకే.. వాహనాల ధరలను పెంచాల్సి వస్తోంది. అయితే, కస్టమర్లపై తక్కువ ప్రభావం పడే విధంగా చూస్తాము," అని మారుతీ సుజుకీ సంస్థ వెల్లడించింది.

టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ సంస్థలే కాదు.. దాదాపు అన్ని సంస్థలు ప్రైజ్​ హైక్​ తీసుకుంటున్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి ధరలను పెంచుకుంటూ వెళుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే కస్టమర్ల మీద చాలా భారం పడుతోంది. మళ్లీ ఇప్పుడు కూడా ధరలను పెంచేందుకు సిద్ధమవుతుండటం ఆందోళనకర విషయం.

మరోవైపు.. ఇండియాలో ఆటోమొబైల్​ సెగ్మెంట్​కి క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. ధరలు ఎంత పెరుగుతున్నా.. కస్టమర్లు వాహనాలను కొంటూనే ఉంటున్నారు. అందుకే.. వాహనాల తయారీ సంస్థలు, ధరల పెంపునకు ధైర్యం చేయగలుగుతున్నాయి!

Whats_app_banner

సంబంధిత కథనం