తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Curvv Ev : వావ్​ అనిపిస్తున్న టాటా కర్వ్​ ఈవీ ఇంటీరియర్​.. ఆ ఫీచర్స్​​ హైలైట్​!

Tata Curvv EV : వావ్​ అనిపిస్తున్న టాటా కర్వ్​ ఈవీ ఇంటీరియర్​.. ఆ ఫీచర్స్​​ హైలైట్​!

Sharath Chitturi HT Telugu

04 August 2024, 5:53 IST

google News
    • Tata Curvv EV launch date in India : టాటా కర్వ్​ ఈవీ లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ సమయంలో వెహికిల్​ ఇంటీరియర్​ టీజర్​ని టాటా మోటర్స్​ రివీల్​ చేసింది.
టాటా కర్వ్​ ఈవీ సన్​రూఫ్​ సెటప్​..
టాటా కర్వ్​ ఈవీ సన్​రూఫ్​ సెటప్​..

టాటా కర్వ్​ ఈవీ సన్​రూఫ్​ సెటప్​..

టాటా మోటార్స్ ఆగస్టు 7న టాటా కర్వ్ ఈవీని భారత మార్కెట్​లో విడుదల చేయనుంది. ఈ కొత్త కూపే ఎస్​యూవీ ఎక్స్​టీరియర్​ని సంస్థ ఇప్పటికే ఆవిష్కరించింది. అంతేకాదు పూర్తిగా ఈ మోడల్​ భారత రోడ్లపై కనిపించేసింది. కాగా టాటా మోటార్స్ ఇప్పుడు ఈ కర్వ్ ఈవీ ఇంటీరియర్​ని కొత్త టీజర్ ద్వారా రివీల్​ చేసింది. ఆ విశేషాలు..

టాటా కర్వ్​ ఈవీ ఇంటీరియర్​..

కొత్త ఫొటోల్లో టాటా కర్వ్​ ఈవీ కూపే ఎస్​యూవీలో డ్యూయెల్-టోన్ థీమ్ ఉన్న క్యాబిన్​కి కాంతిని తీసుకువచ్చే పానోరమిక్ సన్​రూఫ్​ చూడవచ్చు. ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇంజిన్​ని స్టార్ట్ చేయడం/ఆపడం కోసం పుష్ బటన్, రీ-జెన్ లెవల్​ని కంట్రోల్ చేయడం కోసం ప్యాడిల్ షిఫ్టర్​లు కూడా ఉంటాయి.

పంచ్ ఈవీ నుంచి తీసిన డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేసే పెద్ద టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టెమ్ కొత్త నెక్సాన్ నుంచి తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి ఇది గ్లాస్ బ్లాక్ యూనిట్. లెథరెట్ అప్​హోలిస్ట్రీతో కూడిన వెంటిలేటెడ్ సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్లు, గెస్చర్ యాక్టివేషన్​తో పవర్డ్ టెయిల్​గేట్ వంటి ఫీచర్లు ఈ టాటా కర్వ్​ ఈవీలో ఉండనున్నాయి. వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్, వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీని కూడా టాటా అందిస్తోంది. అదనంగా, 6-వే ఎలక్ట్రికల్ అడ్జెస్టిబుల్ డ్రైవర్ సీటు, కో-డ్రైవర్ సీటు ఉంటాయి. వెనుక సీటులో సెంటర్ కన్సోల్​తో పాటు టూ స్టెప్ రెక్లైన్ ఫంక్షన్ ఉంటుంది. లెవల్ 2 ఏడీఏఎస్, డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్​తో కూడిన ఈఎస్​పీ, 6 ఎయిర్ బ్యాగులు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా కర్వ్ లాంచ్..

టాటా కర్వ్​ కూపే ఎస్​యూవీ లాంచ్​ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది తొలుత ఈవీ సెగ్మెంట్​లో అడుగుపెడుతుంది. అనంతరం ఐసీఈ ఇంజిన్​ కూడా లాంచ్​ అవుతుంది. అంతేకాదు.. కూపే ఎస్​యూవీ సెగ్మెంట్​లో లాంచ్​ అవుతున్న తొలి వెహికిల్​ ఈ టాటా కర్వ్​ ఈవీ. త్వరలో లాంచ్​కు రెడీ అవుతున్న సిట్రోయెన్​ బసాల్ట్​, దీనికి పోటీగా నిలువనుంది.

టాటా కర్వ్​ ఈవీ బ్యాటరీ, రేంజ్​ వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్​ సమయానికి ధరతో పాటు అన్ని వివరాలపై క్లారిటీ వస్తుంది.

తదుపరి వ్యాసం