HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Curvv : టాటా కర్వ్​, కర్వ్​ ఈవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​- ఎప్పుడంటే..

Tata Curvv : టాటా కర్వ్​, కర్వ్​ ఈవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​- ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu

14 July 2024, 7:20 IST

    • టాటా కర్వ్, టాటా కర్వ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కూపే లాంచ్​ డేట్​ని టాటా మోటార్స్​ ఫిక్స్​ చేసింది. లాంచ్​ డేట్​తో పాటు వీటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా కర్వ్​ ఎస్​యూవీ కూపే..

టాటా కర్వ్​ ఎస్​యూవీ కూపే..

2024 ఆగస్టు 7న టాటా కర్వ్​ను లాంచ్​ చేయనున్నట్లు ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్​తో కర్వ్​ని టాటా విడుదల చేయనుంది. టాటా మోటార్స్​ లైనప్​లో ఈ కొత్త ఎస్​యూవీ కూపే నెక్సాన్- హారియర్ మధ్యలో ఉంటుంది. కర్వ్​కు ప్రధాన ప్రత్యర్థి రాబోయే సిట్రోయెన్ బసాల్ట్.

టాటా మోటార్స్ తన సోషల్ మీడియా పేజీల్లో కొత్త ఎస్​యూవీ కూపే టీజర్లను విడుదల చేస్తోంది. ఇందులో ప్యాడిల్​ షిఫ్టర్​ ఉంటుందని, ఇది గేర్​బాక్స్​ మేన్యువల్​ కంట్రోల్​కి ఉపయోగపడుతుందని టీజర్ల ద్వారా స్పష్టమైంది. ఇక ఈవీ వర్షెన్​లో ఈ ప్యాడిల్​ షిఫ్టర్​ అనేది బ్రేక్​ రీజనరేటివ్​ లెవల్​ని మార్చడానికి ఉపయోగపడుతుంది.

టాటా కర్వ్, కర్వ్ ఈవీ: ఫీచర్లు..

టాటా కర్వ్​లో సిటీ, ఎకో, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్​లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలో ఉపయోగించే డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే కూడా ఇందులో ఉండనుంది. ఇది కాకుండా కర్వ్​లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్లెస్ ఛార్జర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సన్​రూఫ్​ వంటివి ఉంటాయి. ఇందులో ఏడీఏఎస్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

టాటా కర్వ్: స్పెసిఫికేషన్లు..

ఇప్పటికే టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్​లో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్​నే కర్వ్​లో వాడేందుకు సంస్థ రెడీ అవుతోంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. దీని గురించి ఇంకా సమాచారం బయటకు రాలేదు. గేర్ బాక్స్ ఆప్షన్లు 6-స్పీడ్ మేన్వువల్ యూనిట్, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

టాటా కర్వ్ ఈవీ..

ఇండియా ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​లో టాటా మోటార్స్​ రారాజుగా కొనసాగుతోంది. టాటా కొత్త యాక్టివ్.ఈవీ ప్లాట్ఫామ్, మొదట పంచ్ ఈవీతో పరిచయమైంది. ఇది కర్వ్ ఈవీకి పునాదిగా పనిచేస్తుంది. టాటా కర్వ్ ఈవీ ఎక్స్​పెక్టెడ్​ రేంజ్​ సుమారు 500 కిలోమీటర్లు. వెహికల్ టు లోడ్ ఫంక్షనాలిటీ, బ్రేక్ రీజనరేషన్, డ్రైవింగ్ మోడ్స్, డీసీ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కర్వ్ ఈవీలో ఉన్నాయి. కర్వ్ ఈవీకి ప్రధాన పోటీదారులు ఎంజీ జెడ్ఎస్ ఈవీ, బీవైడి అటో 3, రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీ.

ఈ ఈవీలో కనెక్టెడ్ ఎల్​ఈడీ టెయిల్ లైట్లను టీజర్​లో ఆవిష్కరించగా, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్​ను కాన్సెప్ట్​లో ఇప్పటిక ఉంది. నెక్సాన్ ఈవీలో చూసినట్లుగా స్టార్టప్ సీక్వెన్స్ కోసం యానిమేటెడ్ లైట్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ టాటా కర్వ్​ ఈవీ కూపే ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 10.25 ఇంచ్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​తో పాటు 360 డిగ్రీల కెమెరా, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్​రూఫ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి.

టాటా కర్వ్ ఈవీని మొదటిసారిగా 2022 లో కాన్సెప్ట్​ మోడల్​గా ప్రదర్శించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక తాజాగా లాంచ్​ అయిన టీజర్లని చూస్తుంటే కాన్సెప్ట్​ వర్షెన్​లోని చాలా భాగాలు ప్రొడక్షన్ వెర్షన్​లో కూడా కనిపిస్తాయని స్పష్టమవుతోంది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్