Stocks to buy today : ఎల్ఐసీ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
06 December 2024, 9:20 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్ టు బై టుడే..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 810 పాయింట్లు పెరిగి 81,766 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 241 పాయింట్లు వృద్ధి చెంది 24,708 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 337 పాయింట్లు పెరిగి 53,606 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8539.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2303.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 13,763.9 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 133.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.55శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.19శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.18శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ .1336.5, స్టాప్ లాస్ రూ. 1290, టార్గెట్ రూ. 1430
కేఫిన్ టెక్నాలజీ- బై రూ. 1256.3, స్టాప్ లాస్ రూ. 1200, టార్గెట్ రూ. 1335
గోద్రేజ్ కన్జ్యూమర్- బై రూ. 1250, స్టాప్ లాస్ రూ. 1230, టార్గెట్ రూ. 1275
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్- బై రూ. 4568, స్టాప్ లాస్ రూ. 4500, టార్గెట్‌రూ. 4650
ఎల్ఐసీ- బై రూ. 977, స్టాప్ లాస్ రూ. 955, టార్గెట్ రూ. 995
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జైన్ ఇరిగేషన్: రూ.75.35 వద్ద కొనండి, టార్గెట్ రూ.81, స్టాప్ లాస్ రూ.72.71
టెక్మాకో ఇన్ఫ్రాస్ట్రక్చర్: రూ.144.44 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.155, స్టాప్ లాస్ రూ.139;
హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లేదా హెచ్ఎస్సీఎల్: రూ.570.95 వద్ద కొనండి, టార్గెట్ రూ.611, స్టాప్ లాస్ రూ.551;
గ్రీవ్స్ కాటన్: రూ.198.59 వద్ద కొనండి, టార్గెట్ రూ.213, స్టాప్ లాస్ రూ.191; మరియు
టైన్ వాలా కెమికల్స్: రూ.312 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.335, స్టాప్ లాస్ రూ.300.