Stocks to buy today : స్టాక్ మార్కెట్లో భారీ పతనం- కానీ ఈ 5 షేర్లలో ట్రేడింగ్‌కి ఛాన్స్!
04 October 2024, 8:15 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే లిస్ట్..
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1769 పాయింట్లు పడి 82,497 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 547 పాయింట్లు కోల్పోయి 25,250 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1077 పాయింట్లు పతనమై 51,842 వద్దకు చేరింది.
“25,580 వద్ద ఉన్న 20 డే ఈఎంఏ సపోర్ట్, 25,350 వద్ద ఉన్న ట్రెండ్‌లైన్ సపోర్ట్‌ని నిఫ్టీ50 ఒక్క రోజులో బ్రేక్ చేసింది. ఫలితంగా మార్కెట్ మరింత కిందకి వెళ్లొచ్చు. 25000- 25,150 వద్ద సపోర్ట్ ఉంది. 25,450- 25,600 రేంజ్ వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని రిలేగేర్ బ్రోకింగ్ ఎస్వీపీ రీసెర్చ్‌కి చెందిన అజిత్ మిశ్రా తెలిపారు.
బ్యాంక్ నిఫ్టీలో కూడా మరింత కరెక్షన్ కనిపించే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ 49,700 లెవల్స్ వద్దకు చేరవచ్చని షేర్‌ఖాన్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ జతిన్ గేడియా పేర్కొన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 15243.27 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12913.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సెప్టెంబర్‌లో భారీగా కొనుగోళ్లు చేసిన ఎఫ్ఐఐలు.. అక్టోబర్ మొదటి రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో ఇప్పటివరకు ఏకంగా రూ. 20822.62 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 17523.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.44శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.04 పతనమైంది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య అనిశ్చితి కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్స్ టు బై..
పిట్టి ఇంజనీరింగ్:- బై రూ. రూ .1366.85, స్టాప్ లాస్ ను రూ .1325, టార్గెట్ ధర రూ. 1460
శారదా ఎనర్జీ అండ్ మినరల్స్:- బై రూ. 491.9, స్టాప్ లాస్ రూ. 472, టార్గెట్ రూ. 520
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్:- బై రూ. 4716, స్టాప్ లాస్ రూ. 4650, టార్గెట్ రూ. 4950
మహారాష్ట్ర సీమ్‌లెస్:- బై రూ. 633, స్టాప్ లాస్ రూ. 620, టార్గెట్ రూ. 655
టాటా కమ్యూనికేషన్స్:- బై రూ. 2145, స్టాప్ లాస్ రూ. 2100, టార్గెట్ రూ. 2300