తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : రూ. 290 దగ్గర ఉన్న ఈ స్టాక్​ను కొంటే.. భారీ లాభాలు!

Stocks to buy today : రూ. 290 దగ్గర ఉన్న ఈ స్టాక్​ను కొంటే.. భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

26 September 2023, 8:20 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 15 పాయింట్ల లాభంతో 66,024 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 0.20 పాయింట్లు పెరిగి 19,674.50 వద్ద ముగిసింది. 154 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 44,766 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుతం వీక్​గా ఉన్నప్పటికీ.. రానున్న సెషన్స్​లో అప్​సైడ్​ బౌన్స్​ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 20 వీక్​ సపోర్ట్​ వద్ద నిఫ్టీ ఉండటమే ఇందుకు కారణం.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2333.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1579.28 కోట్లు విలువ చేసే షేర్లొను కొన్నారు.

Stock market news today : ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల డౌన్​లో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- ఈ స్టాక్స్​ మీ దగ్గర ఉంటే.. స్వల్ప కాలంలో భారీ లాభాలు!

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా సూచీలు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.13శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.4శాతం, నాస్​ డాక్​ 0.45శాతం మేర లాభపడ్డాయి.

స్టాక్స్​ టు బై..

Coal India share price target : కోల్​ ఇండియా:- బై రూ. 288, స్టాప్​ లాస్​ రూ. 280, టార్గెట్​ రూ. 301

బజాజ్​ ఫిన్​సర్వ్​:- బై రూ. 1577.40, స్టాప్​ లాస్​ రూ. 1530, టార్గెట్​ రూ. 1674

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ లైఫ్​:- బై రూ. 578, స్టాప్​ లాస్​ రూ. 565, టార్గెట్​ రూ. 600

కమిన్స్​ ఇండియా:- బై రూ. 1738, స్టాప్​ లాస్​ రూ. 1790, టార్గెట్​ రూ. 1710

Asian paints share price target : ఏషియన్​ పెయింట్స్​:- బై రూ. 3323.2, స్టాప్​ లాస్​ రూ. 3182, టార్గెట్​ రూ. 3405

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం