Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఈ 6 స్టాక్స్‌లో ట్రేడింగ్‌కి ఛాన్స్..
23 December 2024, 8:10 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్ టు బై టుడే..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1176 పాయింట్లు పడి 78,042 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 364 పాయింట్లు కోల్పోయి 23,587 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 816 పాయింట్లు పడి 50,759 వద్దకు చేరింది.
ఈ స్టాక్ మార్కెట్ పతనంలో.. నిఫ్టీ 50 ఇండెక్స్ దాని 23,800 వద్ద ఉన్న 200-డీఈఏ మద్దతు కంటే దిగువకు పడిపోయింది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్లో బేర్ సెంటిమెంట్‌ని సూచిస్తోంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇటీవల కనిష్ట స్థాయి 23,250కి చేరువలో ఉంది. ఈ మద్దతు అంతంతమాత్రంగానే ఉంటుందా లేక 50 షేర్ల ఇండెక్స్ కొత్త కనిష్టాన్ని తాకుతుందా అనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3597.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1374.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 4121.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 16546.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.18శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.09శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.03 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఫెడర్స్ హోల్డింగ్: రూ.76 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.78.80, స్టాప్ లాస్ రూ.74.60;
ఐఎఫ్సీఐ: రూ .60.60 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .63.50, స్టాప్ లాస్ రూ .58.70.
ధనలక్ష్మి బ్యాంక్: రూ.41 నుంచి రూ.42, టార్గెట్ రూ.44 - రూ.50, స్టాప్ లాస్ రూ.38
ఎన్హెచ్పీసీసి: రూ .80 నుండి రూ .81.50, టార్గెట్ రూ .84- రూ .90 వద్ద , స్టాప్ లాస్ రూ .77.80.
ఏఎస్ఐ ఇండస్ట్రీస్: రూ.53.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.80, స్టాప్ లాస్ రూ.46
నేషనల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్: రూ .67 వద్ద కొనండి, టార్గెట్ రూ .100, స్టాప్ నష్టం రూ .60